»   » ఎలక్షన్ రిజల్ట్స్:రాజమౌళికి కోపమొచ్చింది

ఎలక్షన్ రిజల్ట్స్:రాజమౌళికి కోపమొచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎలక్షన్ ఫలితాలుపై టీవీ ఛానెల్స్ పై ఆధారపడిన వారికి ఓ విచిత్రం కనపడిన మాట వాస్తవమే. ఒక్కో ఛానెల్ ఒక్కో విధంగా తాము సపోర్టు చేస్తున్న పార్టలను సపోర్టు చేస్తూ ఫలితాను ఆ యాంగిల్ లోనే ప్రెజంట్ చేసాయి. దాంతో సాక్షి లో ఒకలాగ, ఎబిఎన్ లో ఒక విధంగా,ఈటీవీలో మరో విధంగా ఇలా ఒక్కో ఛానెల్ లో ఒక్కో విధంగా ఫలితాలు కనిపించాయి. దాంతో ఏ ఛానెల్ ని పూర్తిగా నమ్మ ఫాలో కావాలో చాలా మందికి అర్దం కాలేదు. ఇదే పరిస్ధితి రాజమౌళికి సైతం ఎదురయ్యినట్లైంది. ఆయన ట్విట్టర్ ద్వారా తన ఆగ్రహాన్ని వెళ్లబుచ్చారు.

రాజమౌళి ట్వీట్ చేస్తూ... MPTC ZPTC రిజల్ట్స్ అంకెలు ప్రతీ ఛానెలకు ఎందుకు మారిపోతున్నాయి. ఏక్చువల్ నెంబర్ కావాలంటే మనకు ఎక్కడ దొరుకుతాయి. గవర్నమెంట్ బులిటెన్ లేదా.. అంటూ ప్రశ్నించారు.

Rajamouli tweet about election results

ప్రస్తుతం రాజమౌళి..బాహుబలి షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం కథ మహాభారతాన్ని పోలి ఉండబోతుందని, అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరు చుట్టూ సినిమా తిరగనుంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్‌ - మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.

ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకుని,విశ్వరూపం ప్రదర్శశిస్తోంది.

English summary
Rajamouli tweeted: "How come each TV channel is showing different number in MPTC ZPTC results? where can we get the actual number?... Any govt bulletin? how can any channel cheat on actual results??? Beats me..."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu