»   » నో నాన్సెన్స్....(నాన్నకు ప్రేమతో ట్రైలర్‍‌పై రాజమౌళి కామెంట్)

నో నాన్సెన్స్....(నాన్నకు ప్రేమతో ట్రైలర్‍‌పై రాజమౌళి కామెంట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో'....ఈ చిత్రం ఆడియో వేడుక ఆదివారం గ్రాండ్ గా జరిగింది. అఫీషియల్ ట్రైలర్ కూడా విడుదల చేసారు. ఈ సినిమా ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా రాజమౌళి కూడాఈ విషయమై స్పందించారు.

‘నాన్నకు ప్రేమతో ట్రైలర్ చాలా స్టైలిష్, కూల్ గా ఉంది. తారక్ ను సుకుమార్ చాలా డిఫరెంటుగా గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రజెంట్ చేసాడు. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో ఎలాంటి నాన్ సెన్స్ ఉండదు అని స్పష్టమవుతోంది. ప్రసాద్ గారికి, సుక్కు, బాపి అండ్ ఎంటర్ టీంకు ఆల్ ది బెస్ట్. తారక్ 25వ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయేలా హిట్ కావాలని రాజమౌళి ఆకాంక్షించారు.సాధారణంగా రాజమౌళి ఏదైనా సినిమా గురించి కామెంట్ చేసారంటే... ఆ సినిమా హిట్టవుతుందనే నమ్మకం ఉంది. ఆయన జడ్జిమెంటు మీద జనాలకు అంత నమ్మకం ఉంది జనాల్లో. ‘నాన్నకు ప్రేమతో' సినిమాకు కూడా ఆయన వాక్కు ఫలిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.


ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇంతకుముందెన్నడూ చూడని వినూత్న గెటప్‌లో కనిపిస్తున్న ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు ఆనందంగా ఉన్నారు. ఒక నిమిషం 29 సెకన్ల ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పటికే యుట్యూబ్‌లో 5 లక్షల 50వేలకుపైగా వ్యూస్ వచ్చాయి.


English summary
"Stylish and cool. Sukumar presented tarak in a way that is entirely different from what he did earlier. Nannaku prematho seems a no nonsense film. All the best prasad garu, Sukku, bapi and the entire team. wishing this 25th film of tarak will be remembered for a long time." Rajamouli tweeted.
Please Wait while comments are loading...