»   » రాజమౌళి భాదపడుతున్నాడట... మొదటి రోజు...మొదటి ఆటకే

రాజమౌళి భాదపడుతున్నాడట... మొదటి రోజు...మొదటి ఆటకే

Posted By:
Subscribe to Filmibeat Telugu

క‌బాలీ... ప్ర‌స్తుతం సౌత్ ఇండియాను షేక్ చూస్తూ ఊరిస్తున్న చిత్రం ఇది! టీజ‌ర్ విడుద‌లైన ద‌గ్గ‌ర నుంచి ఈ చిత్రంపై అంచ‌నాలు ఆకాశానికి అంటేస్తున్నాయ‌ని చెప్ప‌డంలో ఏమాత్రం సందేహం లేదు. ర‌జినీకాంత్ న‌టించిన ఈ చిత్రంపై అభిమానుల‌తో పాటు నిర్మాత‌లూ డిస్ట్రిబ్యూట‌ర్ల‌లో కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి. దీంతో చిత్రం క‌లెక్ష‌న్లు ఒక రేంజిలో ఉంటాయ‌ని ఆశిస్తున్నారు..

మలేసియా, చైనా, జపాన్ లాంటి దేశాల్లో కూడా కబాలి సినిమా కోసం రజినీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కబాలి ట్రైలర్ తెలుగు వెర్షన్‌లోనే ఐదుకోట్ల మంది చూడడం ఓ సంచలనం.ఇక ఇదిలా ఉంటే టికెత్ల కోసం ప్రభుత్వయంత్రాంగాలే తలకిందులవుతున్నాయి. మంత్రుల దగ్గరినుంచి రికమండేషన్లూ..., అడ్వాన్స్ బుకింగ్ లూ... ఇక ఏం చేసాడో ఏమో గానీ తమిళ హీరో శింబు ఏకంగా 250 టికెట్లను కొనేసాడట...

Rajamouli Tweet about Rajini's Kabali

ఈ రభస అంతా జరుగుతూంటే మిస్టర్ కూల్ రాజమౌళి మాత్రం కబాలి మొదటి రోజే చూడలేకపోయినజ్ఞ్దుకు భాదపడుతున్నాడు. రజినీ ఫ్యాన్స్ లిస్టులో ఉండే ప్రముఖులలో టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఒకరు. 'కబాలి' మేనియాలో ఆయన కూడా అతీతుడు కాదు. అయితే తాను ఆ సినిమా తొలి రోజు తొలి ఆట చూడలేకపోయానంటూ వాపోయాడు .. ఈ విష‌యాన్ని జ‌క్క‌న్న త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా త‌న అభిమానుల‌కు తెలిపారు. బాహుబ‌లి-2 షూటింగ్ బిజీబిజీగా ఉండ‌డంతో తాను క‌బాలి చూడ‌లేక‌పోయాన‌ని రాజ‌మౌళి పేర్కొన్నారు. తాను థియేటర్‌లో ఉంటే మాత్రం 'తలైవా' మేనియాలో ఉండేవాడిన‌ని రాజమౌళి తెలిపారు.

English summary
"Missing kabali Stuck in shooting..How i wish i could be there in the theatre engulfed by thalaiva mania..." Director Rajamouli on Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu