»   » శ్రీమంతుడు... గ్రేట్ రెస్పాన్స్: రాజమౌళి స్పందన

శ్రీమంతుడు... గ్రేట్ రెస్పాన్స్: రాజమౌళి స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' సినిమా ఈ రోజు ఉదయం 4 గంటలకే బెనిఫిట్ షోలతో గ్రాండ్ గా రిలీజైంది. సూర్యుడు ఉదయించేలోగా సినిమా టాక్ బయటకు వచ్చింది. విడుదలైన అన్ని చోట్లా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా స్పందించారు.

" శ్రీమంతుడు సినిమాకు అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. చిత్రం టీమ్ కు అభినందనలు" అంటూ రాజమౌళి ట్వీట్ చేసాడు.



మహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈచిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం.


Rajamouli tweet about Srimanthudu reports

ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.


English summary
"Show time srimanthudu...great reports from all over..congratulations to the whole team..." Rajamouli tweeted.
Please Wait while comments are loading...