»   »  రాజమౌళి ట్వీట్ కు ఎన్టీఆర్ ఫుల్ ఖుషీ

రాజమౌళి ట్వీట్ కు ఎన్టీఆర్ ఫుల్ ఖుషీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rajamouli tweet Rabhasa first look
హైదరాబాద్‌: సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకునే దర్శకుడు రాజమౌళి. ఆయన తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న 'రభస' ఫస్ట్ లుక్ పై స్పందించారు. చాలా కాలం తర్వాత తారక్ పవర్ ఫుల్ ఫొటో చూస్తున్నానని, టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. రాజమౌళి దర్శకుడుగా తొలి చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ కి హీరో ఎన్టీఆర్. ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ చిత్రాలు రాజమౌళి, ఎన్టీఆర్ స్టామినా ప్రపంచానికి తెలిపాయి. ఇక ఈ ట్వీట్ చూసుకున్న పూర్తిగా సంతోషపడ్డారని సమాచారం. వారి అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రంలో సమంత, ప్రణీత ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌తో 'కందిరీగ' తీసి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న సంతోష్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. మే 20న జూనియర్‌ ఎన్టీఆర్‌ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్‌ 'రభస' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.

చిత్ర సమర్పకుడు బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ ''ఆది' తరవాత ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న విధానం బాగుంది. ఎన్టీఆర్‌ డ్యాన్సులు, పోరాటాలు అభిమానులకు థ్రిల్‌ కలిగిస్తాయి'' అన్నారు.

దర్శకుడు చెబుతూ ''ఎన్టీఆర్‌ అభిమానులకు ఈ సినిమా పండగలా ఉంటుంది. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. తమన్‌ చక్కటి పాటలిచ్చారు''అన్నారు. సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రభస'. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

English summary
Rajamouli tweetd... "Good to see a powerful photo from a Tarak film after a long time. Wishing the team" good luck.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu