»   » గోన గన్నారెడ్డిపై రాజమౌళి ప్రశంసల వర్షం

గోన గన్నారెడ్డిపై రాజమౌళి ప్రశంసల వర్షం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి ఏదైనా సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలో తనకు నచ్చిన అంశాలను నిర్మొహమాటంగా బయట పెడతారు. తాజాగా విడుదలైన రుద్రమదేవి సినిమా చూసిన తర్వాత దర్శకుడు రాజమౌళి అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర సినిమాకే హైలెట్ అయందని, ఆ పాత్ర వల్లే సినిమాపై మరింత ఆసక్తి పెరిగిందని రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు. బన్నీ ఆన్ స్క్రీన్ లోనే కాదు, ఆఫ్ స్క్రీన్ లోనూ హీరో అంటూ రాజమౌళి కితాబిచ్చారు. రుద్రమదేవి సినిమా ఆగిపోయిన సమయంలో బన్నీ గోన గన్నారెడ్డి పాత్ర చేయడానికి ఒప్పుకుని సినిమాను నిలబెట్టారని చెప్పుకొచ్చారు రాజమౌళి. పన్ను మినహాయింపు విషయంలో బన్నీ రోల్ ఎంతో కీలకం. రెస్పెక్ట్ గోన గన్నారెడ్డి అంటూ రాజమౌళి ట్వీట్ చేసారు.

Rajamouli tweets about Gona Gannareddy

ఇక హీరోయిన్ అనుష్కపై కూడా రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. స్వీటీ స్క్రీన్ ప్రెసెన్స్, డెడికేషన్, కమిట్మెంట్, సిన్సియారిటీ ఉన్న ఆర్టిస్ట్ అంటూ ప్రశంసించారు. రుద్రమదేవి పాత్రను అనుష్క తప్ప మరెవరూ ఈ స్థాయిలో చేయలేరు అని రాజమౌళి ప్రశంసించారు. రానా, ప్రకాష్ రాజ్, దర్శకుడు గుణశేఖర్ ను పొగుడుతూ కూడా రాజమౌళి ట్వీట్స్ చేసారు. ఆ ట్వీట్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

English summary
"Gona Gannareddy all the way. When the film was almost stalled, bunny's entry into the cast revived it. Heard that it was again Bunny who was Instrumental in gettin the tax exemption. And he excelled on screen. A hero on screen and also off it. Respect Gannareddy." Rajamouli tweeted.
Please Wait while comments are loading...