»   » ‘ఐస్ క్రీమ్’ చిత్రం గురించి రాజమౌళి

‘ఐస్ క్రీమ్’ చిత్రం గురించి రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ తాజా హర్రర్ చిత్రం 'ఐస్ క్రీమ్'. నవదీప్, తేజస్వనీ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం గురించి రాజమౌళి రీసెంట్ గా ట్వీట్ చేసి తన అభిప్రాయాన్ని తెలియచేసారు. ఆయన మాట్లాడుతూ..." ఐస్ క్రీమ్ చిత్రాన్ని కంటెంట్ పరంగా ఉదాహరణగా తీసుకోవద్దు... కేవలం వర్కింగ్ మోడల్ మాత్రమే తీసుకోండి ." అన్నారు.

ఇక విభిన్న కథాంశాలతోనే కాకుండా డిఫరెంట్ టైటిల్స్‌తో సినిమాలు తీసే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం 'ఐస్‌క్రీమ్'. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవదీప్ హీరో. తేజస్వి హీరోయిన్. ఈ చిత్రం మొన్న శనివారం విడుదలై ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం రివ్యూలపై కాంట్రావర్శి కూడా వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సీక్వెల్ ని వర్మ ప్రకటించారు. ఈ చిత్రం పోస్టర్ ని సైతం విడుదల చేసారు.

Rajamouli tweets on Ice Cream

ఈ సీక్వెల్ చిత్రాన్ని సైతం వర్మ నాన్‌స్టాప్ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తి చేస్తామని చెప్తున్నారు, ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనిలో నిమగ్నమయ్యారు. స్పీడుగా షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రం సైతం లో బడ్జెట్ లో పూర్తి చేయనునట్లు చెప్తున్నారు.

టైటిల్‌కు తగ్గట్లుగానే వర్మ ఇప్పటివరకూ తీసిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. 'ఐస్‌క్రీమ్' చిత్రానికున్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. తన మొదటి సినిమా 'శివ'తో స్టడీకామ్ కెమెరాను పరిచయం చేసిన రాము తాజాగా ఈ చిత్రంలో ఫ్లోకామ్ అనే కెమెరాను ఉపయోగించారు. దీనిని ఆసియాలోనే తొలిసారిగా ఉపయోగించిన దర్శకుడు వర్మ అని చెప్పాలి. ఫ్లోకామ్‌తో చిత్రీకరించిన సన్నివేశాలను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందుతారని యూనిట్ సభ్యులు చెప్పారు.

English summary
Ram Gopal Varma's horror flick ‘Ice Cream’ starring Navadeep and Tejaswi is drawing flak from all quarters. Rajamouli sharing his feelings on the film tweeted "don't take ice cream as an example for its content...but as a working model."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu