twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' :అసలు సీక్రెట్ చెప్పేసిన విప్పిన రాజమౌళి (వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: మన సినీ పరిశ్రమలో ఇంతకు ముందేన్నడూ లేని భారీ సాంకేతిక పరిజ్ఞానంతో, భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం 'బాహుబలి'. 'బాహుబలి' చిత్రంలో ఉపయోగించిన అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ ను ఉపయోగించిన సంగతి తెలిసిందే. వీటిని రూపొందించిన తీరును చిత్ర దర్శకులు ఎస్‌ఎస్‌రాజమౌళి అభిమానులతో పంచుకున్నారు.

    మకుత అనే సంస్థ ఈ చిత్రంలో 50 శాతం కన్నా ఎక్కువ విజువల్‌ ఎఫెక్ట్స్‌ని రూపొందించింది. ఈ చిత్రానికి ఇంత భారీ హంగులు వచ్చింది ఈ విజువల్‌ గ్రాఫిక్స్‌ వల్లే. ఈ విభాగంలో పని చేసిన వారికి దర్శకులు రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేసారు.

    A show reel of Vfx done by Makuta.They alone contributed to more than 50% of all Vfx work in Baahubali. Thanks guys!!

    Posted by SS Rajamouli on 29 August 2015

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇక ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళ, హిందీ, మళయాళ భాషల్లో రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ వెర్షన్స్ పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

    Rajamouli video about VFX Shots Of Baahubali

    ఇంటర్నేషనల్ మార్కెట్లో మినిమం వంద కోట్లు సంపాదించాలని టార్గెట్ చేసినట్లు చెప్తున్నారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ ప్రేక్షకులు చూడటం కోసం ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ ప్రేక్షకులను అందుకోవాలంటే... అంతర్జాతీయ నిపుణులతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అందులో బాగంగా...హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన Vincent Tabaillon అనే ఎడిటర్ ని ఎంపిక చేసారు.

    ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ కలెక్షన్‌లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం VFX ఎఫెక్టుల గురించి అంతటా చర్చ జరుగుతోంది.

    English summary
    SS Rajamouli tweeted: " A show reel of Vfx done by Makuta.They alone contributed to more than 50% of all Vfx work in Baahubali. Thanks guys!! Baahubali has set an unbelievable trend all over India. The movie has seen a grand release in all four languages Telugu, Tamil, Hindi and Malayalam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X