»   » రాజమౌళిలా మాస్ పల్స్ పట్టడం మరే డైరెక్టర్ కి రాదు...

రాజమౌళిలా మాస్ పల్స్ పట్టడం మరే డైరెక్టర్ కి రాదు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

డైరెక్టర్ రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమకి ఎన్నో సూపర్ హిట్స్ అందించాడు. మాస్ హీరోయిజంని హైట్స్ కి తీసుకుపోయి సంచలనాలు సృష్టించడంలో తనకి తానే సాటి అనిపించాడు. రాజమౌళిలా మాస్ పల్స్ పట్టడం మరెవరికీ రావట్లేదు. అందుకే ఏ స్టార్ డైరెక్టర్ శైలినైనా అవలీలగా అనుకరించే సినీ మేథావులు రాజమౌళి జోలికెళ్లట్లేదు. అంతెందుకు రాజమౌళి వద్ద శిష్యరికం చేసిన వారికి కూడా అతని గుణగణాలు అబ్బడం లేదు. అందుకే రాజమౌళి శిష్యగణమంతా కట్టగట్టుకుని ప్లాపయ్యారు. ఇక రాజమౌళి సినిమాలని రీమేక్ చేయడం కూడా అషామాషి వ్యవహారం కాదు. ఇది గతంలోనే చాలా సార్లు రుజువయింది.

తాజాగా కన్నడంలో తుషార్ రంగనాథ్ దర్శకత్వంలో దునియా విజయ్ హీరోగా వచ్చిన 'కంఠీరవ" అనే సినిమాతో అది మరింత స్పష్టంగా తెలిసిపోయింది. జూ ఎన్టీఆర్ నటించిన 'సింహాద్రి"సినిమాకి రీమేక్ అయిన ఈ చిత్రం ఘోరంగా ప్లాపయింది. రాజమౌళి స్ర్కీన్ ప్లేని యథాతథంగా కాపీ కొట్టినా కానీ కన్నడ దర్శకుడికి రాజమౌళి మ్యాజిక్ చేయడం చేతకాలేదు. దాంతో కంఠీరవ అత్యంత ఘోరంగా మట్టి కరిచాడు. ఇకపై రాజమౌళి సినిమాల్ని రీమేక్ చేయాలనుకునేవారికి 'తస్మాత్ జాగ్రత్త" అంటూ హెచ్చరికలు పంపాడు....

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu