»   » ట్రైలర్ చూసా..విజువల్స్ కు ఇంప్రెస్ అయ్యా‌: రాజమౌళి

ట్రైలర్ చూసా..విజువల్స్ కు ఇంప్రెస్ అయ్యా‌: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: దసరా పండుగ సందర్భంగా ఈ గురువారం విడుదల అవుతున్న 'కంచె' చిత్ర బృందానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన అభినందనలు తెలిపారు. ఈ చిత్రం సరికొత్త ట్రైలర్‌ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది.

ఈ ట్రైలర్‌ను వీక్షించిన అనంతరం రాజమౌళి తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా చిత్ర దర్శకుడు క్రిష్‌కి, చిత్ర బృందానికి తన అభినందనలు తెలిపారు.


Even more impressed with the visuals in the Kanche latest trailer. So much work and research has gone into making it. Wishing Krish and the entire team all the best for tomorrow's release!


Posted by SS Rajamouli on 21 October 2015

ఈ చిత్రం ట్రైలర్‌లోని సన్నివేశాలు, చిత్రీకరించిన విధానం తనకు ఎంతో బాగా నచ్చిందని ఆయన అన్నారు. ఈ చిత్రం కోసం క్రిష్‌ ఎంతో పరిశోధన చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చిత్రం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.


క్రిష్‌ దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌, ప్రగ్యా జైశ్వాల్‌లు జంటగా నటించిన 'కంచె' చిత్రం సరికొత్త ట్రైలర్‌ విడుదలైంది. హీరో వరుణ్‌తేజ్‌ తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... వీడియో లింక్‌ను అభిమానులతో పంచుకున్నారు.


రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా సందర్భంగా ఈ గురువారం 'కంచె' ప్రేక్షకుల ముందుకు రానుంది.


Rajamouli Wishes to Kanche unit

వరుణ్ తేజ మాట్లాడుతూ...క్రిష్‌పై నమ్మకమే నన్ను ధైర్యంగా ముందుకు నడిపించింది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే సినిమా కావడంతో పాత్రకు తగ్గట్టుగా తర్ఫీదు పొందాల్సి వచ్చింది. ఇందులో నేను సంభాషణలు పలికే తీరు భిన్నంగా ఉంటుంది. అందుకే క్రిష్‌ పాత సినిమాలు చూడమని సలహా ఇచ్చాడు.


సైనికుడిగా కనిపించాల్సి వుంటుంది కాబట్టి ఆ హావభావాలు కావాలన్నాడు. అందుకోసం ఒక మాజీ మిలటరీ అధికారి దగ్గర తగిన శిక్షణ తీసుకొన్నా. గ్రామీణ నేపథ్యంలో సాగే సన్నివేశాల కోసం ఎన్టీఆర్‌గారు, ఏఎన్నార్‌గారు, కృష్ణగారు చేసిన పాత సినిమాల్ని బాగా గమనించా. యుద్ధం నేపథ్యంలో సాగే కొన్ని హాలీవుడ్‌ సినిమాల్నీ చూసి సినిమా కోసం సన్నద్ధమయ్యా.

English summary
SS Rajamouli share in FB: "Even more impressed with the visuals in the Kanche latest trailer. So much work and research has gone into making it. Wishing Krish and the entire team all the best for tomorrow's release!"
Please Wait while comments are loading...