»   » పోలీస్ కాపలాతో షూటింగ్ ..ఫ్యాన్స్ కు నిరాశ

పోలీస్ కాపలాతో షూటింగ్ ..ఫ్యాన్స్ కు నిరాశ

Posted By:
Subscribe to Filmibeat Telugu

మండ్య : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న లింగా సినిమా చిత్రీకరణ ఇక్కడికి సమీపంలోని మేలుకోటెలో కొనసాగుతోంది. గ్రామీణ యువతి పాత్రను సోనాక్షి సిన్హా నటిస్తోంది. చిత్రీకరణ లొకేషన్‌కు మూడు కిలోమీటర్ల దూరంలోనే పోలీసు కాపలాను ఏర్పాటు చేశారు. లొకేషన్‌ పరిసరాల్లోకి ఎవ్వరినీ అనుమతించడంలేదు. రజనీకాంత్‌ను చూడాలనే ఆశతో పరిసర గ్రామాల నుంచి వచ్చిన గ్రామస్థులు నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. లొకేషన్‌కు కారులో వెళ్తున్న రజనీకాంత్‌ను దూరం నుంచి చూసి తృప్తిపడాల్సి వచ్చింది. రెండు రోజుల పాటు మేలుకోటెలో చిత్రీకరణను కొనసాగిస్తారని తెలిసింది.

పోలీస్ కాపలాకి కారణం వివాదం... కావేరి నదీ జలాల వివాదంలో కర్ణాటకకు వ్యతిరేకంగా మాట్లాడిన రజనీకాంత్‌కు రాష్ట్రంలో చిత్రీకరణలో పాల్గొనే నైతికత ఎక్కడుందని కన్నడ సంఘాల కార్యకర్తలు ప్రశ్నించారు. ఇక్కడికి సమీపంలోని ఐజూరు గ్రామంలో కస్తూరి కన్నడ సంఘం కార్యకర్తలు రజనీకాంత్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గత ఏడాది కావేరి వివాదం సందర్భంలో రజనీకాంత్‌ తమిళనాడుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడమే ఈ ఆక్రోశానికి కారణం.

Rajani 'Linga' on floor at Madya

ఇలాంటి వ్యక్తిని హీరోగా పెట్టుకుని సినిమాను రూపొందిస్తున్న నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ను విమర్శించారు. రజనీకాంత్‌ హీరోగా లింగ సినిమా చిత్రీకరణ మండ్య జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. శనివారం ఈ సినిమా చిత్రీకరణను శ్రీరంగపట్టణ సమీపంలో కొనసాగించారు. ఆ ప్రదేశంలోకి అభిమానులతో పాటు మీడియాను దూరం ఉంచారు. రజనీకాంత్‌ మనవడు (ధనుష్‌- ఐశ్వర్య కుమారుడు) పేరు కూడా లింగా కావడం గమనార్హం.

ఇక మొదట ప్లాన్ చేసినట్లు కాకుండా చివరి నిముషాల్లో 'లింగ' సినిమా చిత్రీకరణ లొకేషన్‌ను మార్చారు. ముందు నిర్ణయించిన ప్రకారం శుక్రవారం ముహూర్తం సన్నివేశాన్ని మైసూరు ప్యాలెస్‌లో చిత్రీకరించాలని నిర్ణయించారు. ఇందుకు ప్యాలెస్‌ మండలి అనుమతిని నిరాకరించింది. దీంతో లొకేషన్‌ను మండ్య జిల్లా మేలుకోటెకు మార్చారు. వారం రోజుల పాటు మేలుకోట, శ్రీరంగపట్టణ, కృష్ణరాజసాగర పరిసరాల్లో చిత్రీకరణను కొనసాగించనున్నారు. రజనీకాంత్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరానున్నందున భద్రత కోసం రెండు ప్లటూన్ల పోలీసులను వినియోగించనున్నట్లు మండ్య ఎస్పీ భూషణ్‌ గులాబ్‌రావు బోరసె తెలిపారు.

ప్యాలెస్‌లో ఏ సినిమా చిత్రీకరణకు కూడా అనుమతించడం లేదని ప్యాలెస్‌ మండలి ఉప సంచాలకుడు సుబ్రమణ్య స్పష్టం చేశారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రూపొందిస్తున్న లింగ సినిమా చిత్రీకరణకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారని అయితే అనుమతిని నిరాకరించినట్లు తెలిపారు. కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్‌ నటించిన మయూర సినిమా తరువాత ఏ చిత్రీకరణకు అవకాశం ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.

English summary
Rajanikanth's Linga shooting from May 3 at Mandya district that is known as land of 'Sugar Cane' it continue till 11 May in the beautiful surroundings. It is already known that this KS Ravikumar direction Tamil film has AR Rehman music, Sonakshi Sinha and Anushka Shetty, Jagapathi Babu are in lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu