»   »  రజనీ 'కబాలి' మేకింగ్ (వీడియో) ఇదిగో, నిముషాల్లో రికార్డ్ వ్యూస్

రజనీ 'కబాలి' మేకింగ్ (వీడియో) ఇదిగో, నిముషాల్లో రికార్డ్ వ్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: దేశంలో ఎక్కడ చూసినా, విన్నా కబాలి, కబాలి, అంతలా ఫీవర్ పట్టుకుంది. ఈ శుక్రవారం 'కబాలి' థియేటర్లలో గ్రాండ్‌గా రాబోతూండటంతో అందరూ ఈ సినిమా స్వాగతం పలుకుతూ... సౌతిండియా మొత్తం రజనీ నామస్మరణ చేస్తోంది. కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా అటు నార్త్ ఇండియాలోనూ 'కబాలి'పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం మేకింగ్ ని విడుదల చేసారు నిర్మాతలు.


యాక్షన్ సీన్స్ తో పాటు రజనీ స్టైల్స్ కలిపి రూపొందించిన ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తున్న నెర్పుడా.. సాంగ్ తో అదరకొట్టారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే లక్షకు పైగా వ్యూస్ తో రజనీ సత్తా చాటింది. దాంతో కబాలి మేకింగ్ వీడియో ఆన్ లైన్ లో సృష్టించబోయే సరికొత్త రికార్డ్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక కబాలి చిత్రం అమెరికాతోపాటు అనేక దేశాల్లోనూ 'కబాలి' 22న వెండితెరపై దర్శనమివ్వబోతున్నది.


నిర్మాత థాను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ....రజనీ సినిమా రూ. 500 కోట్లకుపైగా వసూలు చేయడం ఖాయమని ప్రకటించి మరింత అంచనాలు రేపారు. మొత్తానికి పెద్దగా ప్రచారం చేయకపోయినా ప్రజల్లోకి భారీ అంచనాలతో వెళుతోంది.


Rajani's Kabali Tamil Movie Making

మరో ప్రక్క ...తమిళనాడు హోసూరుకు చెందిన ఓ మారుతీ డీలర్ రజనీ అభిమానులను ఆకట్టుకునేందుకు 'కబాలి' కార్లను అమ్ముతోంది. మారుతి స్విఫ్ట్ కార్లను 'కబాలి' పోస్టర్లతో డిజైన్ చేసి అందిస్తోంది.


ఇక ఎయిర్ ఆసియా కంపెనీ శుక్రవారం సినిమా విడుదల రోజున 'కబాలి' ఫ్లయిట్‌ను నడుపనుంది. అంతేకాకుండా ఈ విమానంలో ప్రత్యేక కబాలి మీల్స్‌ను అరెంజ్ చేశారు. అలాగే రజనీ అభిమానుల కోసం శుక్రవారం ఉదయం 5 గంటలకే షో వేస్తున్నారు. ఈ షోలకు సంబంధించిన అన్ని టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఇక అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించిన రెండుగంటల్లోనే టికెట్లు అమ్ముడైపోయాయి.


English summary
Rajani's Kabali Tamil Movie Making released. Kabali is an upcoming 2016 Indian Tamil-language film written and directed by Pa Ranjith. The film stars Rajinikanth, Radhika Apte and Dinesh. Music composed by Santhosh Narayanan. Think Music has acquired the audio rights for all three languages – Tamil, Telugu and Hindi. Kabali Songs.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu