For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫీవర్ మొదలైంది:‘లింగ’ సెన్సార్ సర్టిఫికేట్ ఇదే...(ఫొటోలు)

  By Srikanya
  |

  చెన్నై : రజనీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘లింగ' సినిమా ముందు చెప్పిన సమయానికే విడుదల అవుతోంది. ఈ సినిమాకు సెన్సార్‌ పూర్తై...బోర్డు ‘ యు ' సర్టిఫికేట్‌ ఇచ్చింది. ‘లింగ' నిడివి 2 గంటల 54 నిమిషాలు (175 నిముషాల, 42 సెకండ్లు) . రజనీకాంత్‌ పుట్టిన రోజు డిసెంబర్‌ 12న ఎట్టి పరిస్థితుల్లో ‘లింగ'ను విడుదల చేయాలని కంకణం కట్టుకునే పనులన్నీ వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘‘లింగ''. రజనీ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క నటిస్తున్నారు.

  కె.యస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం సెన్సార్‌ పనులు పూర్తి కావడంతో నిర్మాతలు ప్రమోషనల్‌ కార్యక్రమాల మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటించిన చిత్రంలో జగపతిబాబు విలన్‌గా నటించారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, జగపతిబాబు కలిసి నటించిన మునుపటి చిత్రం కథానాయకుడు సినిమా ప్రేక్షకులను నిరాశపర్చింది. మరీ ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.

  ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరపర్చిన మ్యూజిక్‌ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తోందని అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొసమెరుపు ఏంటంటే సినీ ప్రస్తానం మొదలు పెట్టిన రజనీకాంత్‌ 40 ఏళ్లలో ఆయన పుట్టిన రోజు నాడు విడుదలవుతున్న తొలి సినిమా ‘లింగ' కావడం విశేషం.

  మిగతా విశేషాలు స్లైడ్ షోలో..

  అంత పెట్టి ఈరోస్ వాళ్లే...

  అంత పెట్టి ఈరోస్ వాళ్లే...

  రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రానికి ఎంత క్రేజ్‌ ఉంటుందో చెప్పమంటే ఎవరూ చెప్పలేని

  పరిస్థితి. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తం థియేటర్‌ హక్కులను ఈరోస్‌ సంస్థ 160 కోట్లకు సొంతం చేసుకుంది.

  ఇక్కడా మొదలైంది

  ఇక్కడా మొదలైంది

  ఈ చిత్రం తెలుగు విడుదల హక్కులు ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా లిమిటెడ్‌ సంస్థ కైవసం చేసుకుంది. ఇప్పటికే తెలుగు వెర్షన్‌కు

  సంబంధించిన బిజినెస్‌ కూడా ప్రారంభమైంది.

  కేవలం సీడెడ్ కే...

  కేవలం సీడెడ్ కే...

  ‘ లింగ ' సీడెడ్‌ హక్కులను ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి సొంతం చేసుకున్నట్లు సమాచారం. 6 కోట్ల 30 లక్షల రూపాయలకు ఈ రైట్స్‌ను ‘లెజెండ్‌' నిర్మాత దక్కించుకున్నారని ఫిలింవర్గాల టాక్‌. అదే నిజమైతే రజనీకాంత్‌ చిత్రం సీడెడ్‌కు ఇంత భారీ మొత్తంలో అమ్ముడు కావడం రికార్డుగా నిలుస్తుంది.

  ఎన్ని రోజులు ...

  ఎన్ని రోజులు ...

  దాదాపు వందకోట్ల బడ్జెట్‌తో నిర్మాణ మవుతున్న రజనీకాంత్‌ తాజా సినిమా 'లింగ' షూటింగ్‌ కేవలం 85 రోజుల్లోనే పూర్తిచేశారు.

  మిగతా పనులతో కలిపి..

  మిగతా పనులతో కలిపి..

  ఈ ఏడాది ఆగస్టు 27న బెంగుళూరులో 'లింగ' షూటింగ్‌ మొదలైంది. మిగతా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు సైతం పూర్తిచేసి 110 రోజుల్లో అంటే డిసెంబర్‌ 12న విడుదల చేయనున్నారు.

  షూటింగ్ ఎక్కడ...

  షూటింగ్ ఎక్కడ...

  బెంగుళూరు, ఆ తర్వాత హైదరాబాద్‌ ఫిల్మ్‌ సిటీలో ఎక్కువభాగం షూటింగ్‌ చేశారు. త్వరితగతిన పూర్తిచేసిన ఈ చిత్రం కోసం కేవలం ఒక రోజులోనే రజనీకాంత్‌ డబ్బింగ్‌ చెప్పేశారు. డిసెంబర్‌ 12న రజనీ పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  అందుకే ఆ స్పీడు

  అందుకే ఆ స్పీడు

  ఇక 'కొచ్చాడియన్‌' తర్వాత రజనీ నటిస్తున్నచిత్రమిది. కొచ్చాడియన్‌ అభిమానులను పూర్తిస్థాయిలో అలరించలేక పోయింది. అందువల్ల వారికి వెనువెంటనే పూర్తిస్థాయి కమర్షియల్‌ అంశాలున్న చిత్రాన్ని అందించాలనే ఉద్దేశంతో 'లింగ' చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు రజనీ. 'లింగ' చిత్రానికి కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వం వహించారు. ఆయన చాలా వేగంగా సినిమాలు తీస్తారని ప్రతీతి. ఆయన కోరిక మేరకు సినిమాను పూర్తిచేశారు.

  దర్శకుడు మాట్లాడుతూ...

  దర్శకుడు మాట్లాడుతూ...

  ''రజనీకాంత్‌ను మరోసారి మాస్‌ లుక్‌లో చూపించే ప్రయత్నమీ చిత్రం. స్వాతంత్య్రం ముందు, తర్వాత తరాలకు చెందిన రెండు పాత్రల్లో రజనీకాంత్‌ కనిపిస్తారు'' అంటున్నారు దర్శకుడు.

  నిర్మాత మాట్లాుడుతూ...

  నిర్మాత మాట్లాుడుతూ...

  ''చిత్రంలో రజనీకాంత్‌ మాస్‌ మసాలా యాక్షన్‌ నాయకుడిగా కనిపిస్తాడు. అన్ని వర్గాలవారినీ అలరించేలా దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. సినిమాలో రజనీ పాత్ర చిత్రణ సరికొత్తగా ఉంటుంది'' అన్నారు.

  కథ చర్చ...

  కథ చర్చ...

  ఈ సినిమా కథ గురించి ఇటీవల ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య కట్టిన ముళ్ల పెరియార్‌ డ్యామ్‌ నేపథ్యంలో తీర్చిదిద్దన కథతో తెరకెక్కుతోందని కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పెరియార్‌ డ్యామ్‌పై వివాదం నడుస్తోంది. మరి ఈ సినిమాతో రజనీ ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలందిస్తున్నారు.

  ద్విపాత్రాభినయం...

  ద్విపాత్రాభినయం...

  ఈ చిత్రంలో రజనీ దొంగగా, ఇంజినీరు గా ద్విపాత్రలలో కనపించనున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో ఇంజినీరు పాత్ర వస్తుందని తెలుస్తోంది. సినిమాకు కీలకంగా ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఉండబోతోందని తెలుస్తోంది. దొంగ పాత్రకు, బ్రిటీష్ వారి సమయంలో కనిపించే ఇంజినీరు పాత్రకు ఉన్న లింకేంటి, ఇంజినీరు గా రజనీ ఏం చేసాడు...అది ప్రస్తుత కాలానికి ఎలా ముడిపెట్టారన్నది కీలకం కానుంది.

  వివాదం...

  వివాదం...

  'లింగా' చిత్రం విడుదలను అడ్డుకోవాలని మద్రాసు హైకోర్టు మదురై బెంచీలో పిటీషన్‌ దాఖలైంది. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లింగా' చిత్రాన్ని రజనీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 12న విడుదల చేసేందుకు ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ భారీఎత్తున సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో 'లింగా' చిత్ర కథ తనదేనని రవిరత్నం అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో ప్రస్తావించారు. 2013లో తాను యూట్యూబ్‌లో విడుదల చేసిన 'ముల్లెవనం- 999', 'లింగా' కథ ఒకటేనన్న సమాచారం తనకు తెలిసిందని పేర్కొన్నారు.

  'లింగ' ఫీవర్‌

  'లింగ' ఫీవర్‌

  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆరుపదుల వయస్సులోకి వచ్చినా.. ఆయన సినిమాలంటే తమిళ సినీ జనాలకు సంక్రాంతి పండుగే. దాదాపు ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత రజనీకాంత్‌ నటిస్తుండటంతో 'లింగ' కోసం స్థానికంగా భారీ పోటీ నెలకుంటోంది. ఈ సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు భారీ స్థాయిలో పోటీ పడుతున్నారు. ఈ పోటీ కోయంబత్తూరులో తీవ్రస్థాయికి చేరుకుంది.

  అన్నీచోట్లా...

  అన్నీచోట్లా...

  చెన్నై తర్వాత అధిక సంఖ్యలో థియేటర్లున్న నగరం కోయంబత్తూరు. ఇక్కడ 90 థియేటర్లు ఉన్నాయి. వీటిలో 83 థియేటర్లలో 'లింగ'నే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇంకా మరిన్ని రికార్డులు సృష్టించడానికి ఈ చిత్రం సిద్ధమవుతోంది.

  ఎవరెవరు..

  ఎవరెవరు..

  చిత్రంలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపిస్తారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. ఈ సినిమాలో నయనతార ప్రత్యేక గీతంలో నర్తించనుందని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు

  English summary
  'Lingaa' has been cleared by the Censor Board with a Clean 'U' Certificate. Here is censor certificate of this crazy project starring Rajinikanth, Sonakshi Sinha and Anushka Shetty. The film is 175 minutes, 42 seconds long. Worldwide theatrical release is on December 12th on the eve of Superstar's birthday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X