»   »  చక్కని కధా చిత్రం : 'విక్రమసింహా' (ప్రివ్యూ)

చక్కని కధా చిత్రం : 'విక్రమసింహా' (ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : ఆర్దిక సమస్యలతో ఎన్నో మార్లు వాయిదాలు పడి, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రజనీకాంత్‌ 'విక్రమ్ సింహా‌' ఎట్టకేలకు ఈ రోజు విడుదల అవుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం రజనీ గత చిత్రాలకు ఉన్నంత క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. కారణం యానిమేషన్ లో తెరకెక్కటమే...దాంతో ఈ చిత్రాన్ని పిల్లలకు మాత్రమే అన్నట్లు భావిస్తూ ప్రచారం జరిగింది. అయితే చిత్రం కథ ఆకట్టుకునే విధంగా ఉంటుందని, రజనీ అభిమానులను ఎక్కడా నిరాసపరచదని చెప్తున్నారు.

  అందిన సమచారం ప్రకారం... ఈ చిత్రం కథ ఏమిటంటే... సినిమా ప్రారంభం భవిష్యత్ ని వెతుక్కుంటూ పడవలో ప్రయాణిస్తున్న ఓ కుర్రాడు, పడవకి ఓ రాయి తగలటంతో నదిలో పడిపోతాడు. అప్పుడు రజనీ ఎంట్రన్స్. రజనీ,ఆ దేశపు రాజైన తన స్నేహితుడుతో కలిసి విజ్ఞానం సంపాదించటం కోసం చుట్టుప్రక్కల రాజ్యాలను పర్యటిస్తూంటారు. అ యితే అనుకోని విపత్కర పరిస్ధితుల్లో ఇరుక్కున్న వారి తాము చిక్కుకున్న దేశ ప్రజలు అంతా బానిసలు గా,తిండి కోసం కొట్టుకుంటూ బ్రతుకుతున్నట్లు తెలుస్తుంది. దాంతో బాధపడ్డ రజనీ..వారి కష్టాలు తీర్చటానికి వారి తరుపున పోరాడటానికి, వారికి విముక్తి కలిగించటానికి సిద్దపడతాడు. ఆ ప్రాసెస్ లో అతనికో నిజం(ఫ్లాష్ బ్యాక్) తెలుస్తుంది. అక్కడ నుంచి అది పర్శనల్ రివేంజ్ గా మారుతుంది. ఇంతకీ ఆ నిజం ఏమిటనేది మిగతా కథ. అయితే ఈ కథే సినిమానా కాదా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.


  Rajani's Vikrama Simha preview

  8వ శతాబ్దానికి చెందిన కోచ్చడయాన్‌ రందిరన్‌ అనే పాండ్య రాజు కథ ఇది. ఈ సినిమాలో రజనీకాంత్‌ త్రిపాత్రిభినయం చేశారు. తండ్రి, అతని ఇద్దరి కొడుకులుగా రజనీ కనిపించబోతున్నారు. కోచ్చడయాన్‌ అంటే భుజాలపైకి వేలాడే పొడవాటి జుట్టు ఉన్న రాజు అని ఓ అర్థం. ఇందులో వదనాదేవిగా దీపికా పదుకొణే నటిస్తోంది. త్రీడీ పెర్‌ఫార్మెన్స్‌ మోషన్‌ క్యాప్చరింగ్‌ విధానంలో సినిమాని తెరకెక్కించారు.

  అలాగే... సినిమాలో విజువల్‌ గ్రాఫిక్స్‌ ద్వారా అలనాటి హాస్యనటుడు నగేష్‌ని చూపించబోతున్నారు. ఈ సినిమా కోసం సముద్రం అడుగున రజనీకాంత్‌ డాల్ఫిన్లతో పోరాడే సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమాకిది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాని తమిళం, తెలుగు, బెంగాలీ, పంజాబీ, మరాఠి, ఒడియాలతో పాటు ఇంగ్లిష్‌లో తెరకెక్కిస్తున్నారు. జర్మన్‌, ఫ్రెంచ్‌, ఇటాలియన్‌, జపనీస్‌ భాషల్లో అనువాదం చేసే అవకాశాలున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చని సమాచారం.

  బ్యానర్: లక్ష్మి గణపతి ఫిలింస్‌
  నటీనటులు: రజనీకాంత్, దీపికా పదుకోని, శరత్‌కుమార్‌, స్నేహ, ఆది, శోభన, నాజర్‌, జాకీ ష్రాఫ్‌ తదితరులు
  కథ: కె.ఎస్‌.రవికుమార్‌,
  సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌,
  ఛాయాగ్రహణం: రాజీవ్‌ మీనన్‌,
  కూర్పు: ఆంటోని.
  నిర్మాత: సునీల్‌ లుల్ల
  తెలుగు వెర్షన్ నిర్మాత : బి.సుబ్రహ్మణ్యం
  సహ నిర్మాతలు: ఎరోస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, మీడియా వన్‌ గ్లోబర్‌
  దర్శకత్వం: సౌందర్య రజనీకాంత్

  English summary
  Super star Rajinikath’s much awaited multi-lingual film “Kochadaiyaan” (Vikramasimha) is gearing for grand worldwide release Today. The count has been started for this first Indian motion capture film and the film is creating positive buzzes in industry with few hours of its release.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more