»   » స్వామి దయానంద గిరి కన్నుమూత..రజనీకాంత్ ట్వీట్

స్వామి దయానంద గిరి కన్నుమూత..రజనీకాంత్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్వామి దయానంద గిరి కన్నుమూశారు. రిషికేశ్‌లోని ఆశ్రమంలో ఆయన తుదిశ్వాస విడిచారు. దయానంద గిరి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రి నుంచి ఆశ్రమానికి తరలించారు. ఈ సందర్బంగా రజనీకి సన్నిహితులైన దయానంద గిరి గురించి సంతాపం తెలియచేస్తూ ట్వీట్ చేసారు.

గత పదిరోజులుగా జాలీగ్రాంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వామి దయానంద్ గిరి ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రి నుంచి ఆశ్రమానికి బుధవారమే తరలించారు. బుధవారం రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన స్వామి దయానంద గిరి ఆశ్రమంలోనే కన్నుమూశారు. సెప్టెంబర్ 25న స్వామి దయానంద గిరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Rajanikanth tweeted about sri swami Dayananda death

ఇటీవలే దయానంద గిరిని ప్రధాని మోదీ కలిశారు. దయానంద మృతి పట్ల వివిధ రంగాల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా, గురువు తుదిశ్వాస విడిచిన విషయాన్ని తెలుసుకున్న మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన లేకపోవడం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన ఆలోచనలు అనేకమంది ప్రజల్లో స్ఫూర్తి నింపాయని అన్నారు.

English summary
Rajinikanth tweet: "Pujya sri swami Dayananda guru ji, We seek your blessings and will miss you forever. Placing our Pranams at your feet. Pls be with us always". spiritual guru Swami Dayanand Giri passed away tonight at his ashram in Sheeshamjhadi area here after a prolonged illness. He was 87.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu