twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రాజన్న’ సెన్సార్ రిపోర్టు, కత్తెర పడింది!

    By Bojja Kumar
    |

    అక్కినేని నాగార్జున హీరోగా వస్తున్న 'రాజన్న' సినిమా మరో మూడు రోజుల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 13న తమకు తాముగా తొలుత సెన్సార్ చేసుకున్న దర్శక నిర్మాతలు....తాజాగా సినిమా కాపీని సెన్సార్ బోర్డు పరిశీలనకు పంపారు. సెన్సార్ బోర్డు వారు ఎలాంటి కత్తెరలు వేయకుండా ముందే ఎడిట్ చేసినప్పటికీ...బోర్డు సభ్యులు మూడు చోట్ల చిన్న చిన్న కత్తెర వేయాల్సిందే అని తేల్చి చెప్పినట్లు సమాచారం. మరికొన్ని గంటల్లో సెన్సార్ రిపోర్టుతో పాటు, ఏ కేటగిరీ సర్టిఫికెట్ జారీ చేశారు అనేది విషయం బయటకు వెల్లడయ్యే అవకాశం ఉంది. సినిమా మొత్తం డ్యూరేషన్ 135 నిమిషాలు ఉన్నట్లు సమాచారం.

    నాగార్జున కెరీర్‌లోనే భారీ అంచనాలతో విడుదలకు సిద్ధం అవుతున్న రాజన్న సినిమా మంచి విజయం ఖాయమని, ఒక వేళ అంచనాలు తప్పినా మినిమమ్ గ్యారంటీ అని సినిమా ట్రేడ్ వర్గాలంటున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ ప్రేక్షకుల్లో సినిమాలపై ఆసక్తిని పెంచుతున్నాయి. విజువల్ గా, సాంకేతిక విలువల పరంగా సినిమా ఒక అద్భుతం అని నాగార్జున ఇప్పటికే వెల్లడించారు. విజయేంద్ర వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు, రాజమౌళి యాక్షన్ పార్టును డైరెక్ట్ చేశారు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సినిమాను భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    King Nagarjuna’s most sough periodical movie Rajanna has completed its censor scrutiny on December 13 itself. The censor board members need to complete the entire formalities and once they are done with it they will issue the censor certificate, says the report. It is learnt that the censor members have suggested 3 minor cuts to the makers of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X