twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జునని ఓ ధీరోదాత్తుడిగా చూపించిన రాజమౌళి...?

    By Sindhu
    |

    అక్కినేని నాగార్జున హీరోగా ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రాజన్న సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రామాలు జరుపుకుంటుంది. ఈ సినిమా ఆడియోని ఈ నెల 27న రిలీజ్ చేసి సినిమాని డిసెంబర్ 22న విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కథకి బాగా ఇంప్రెస్ అయిన నాగార్జున ఈ సినిమాని తన సొత బ్యానర్ అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై భారీ వ్యయంతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

    తెలంగాణా ప్రాంతంలో నిజాం పాలకులు పాలనలో రజాకారుల ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఆదివాసీలకు అండగా పోరాడిన గిరిజన యోధుడుగా నాగార్జున ఈ సినిమాలో కనిపించబోతున్నారట. ఈ చిత్రాన్ని ఆదివాసీల హక్కుల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఓ ధీరోదాత్తుడి కథగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో కీలక సన్నివేశాలను రాజమౌళీ తెరకెక్కించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    నాగార్జునే స్వయంగా నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. నాగార్జున మొడటి సారిగా ఓ ఫెరోషియస్ క్యారెక్టర్ లో నటించిన ఈ చిత్రంలో ఓ పాప పాత్ర ప్రధాన ఆకర్షణ కానున్నాయని సమాచారం.

    English summary
    Nagarjuna is performing completely different character from the movies he acted.Rajanna character is going to be Indian revolutionary leader from Telangana.Sneha is acting as heroine in this movie.Rajamouli is directing action part and movie is directed by Vijayendra Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X