»   » అవన్నీ రూమర్సే, నమ్మొద్దు :రాజశేఖర్

అవన్నీ రూమర్సే, నమ్మొద్దు :రాజశేఖర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒక్కోసారి కొన్ని వార్తలు వింటూంటే అవి రూమర్సేమో అని డౌట్ వస్తుంది కానీ మీడియాలో వచ్చింది కాబట్టి నమ్మాలి కదా అనిపిస్తుంది. దాంతో రూమర్స్ కూడా న్యూస్ తరహాలో పబ్లిసిటీ అవుతూ పబ్లిక్ లోకి దర్జాగా వచ్చేస్తూంయి. అవి రూమర్స్ అని సదరు సంస్దలు, వ్యక్తులు వచ్చి ఖండించే దాకా అవి చెలమణి అవుతూ స్ప్రెడ్ అవుతూంటాయి.

రీసెంట్ గా రాజశేఖర్ పై అలాంటి రూమరే వచ్చింది. రాజశేఖర్, తేజ కాంబినేషన్ లో అహం టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ చాలా కాలం గ్యాప్ తర్వాత నెగిటివ్ రోల్ చేస్తున్న ఈ చిత్రంపై అంతటా ఆసక్తి నెలకొంది.

కొద్ది రోజులు షూటింగ్ తర్వాత... ఈ ప్రాజెక్టు నుంచి రాజశేఖర్ తప్పుకున్నట్లు రీసెంట్ గా మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.అయితే కేవలం రూమర్స్ మాత్రమే అని రాజశేఖర్ స్వయంగా ఖండన చేసారు.

Rajasekhar and Teja’s film on?

రాజశేఖర్ మాట్లాడుతూ ..."నేనూ విన్నాను, ఇలాంటివి ఎక్కడ నుంచి మొదట పుడతాయో నాకు అర్దం కావటం లేదు.డిస్కషన్ స్టేజీలోనే ఉన్న సినిమా షూటింగ్ మొదలు కావటమేంటి...నేను తేజ...ఇంకా ఈ స్క్రిప్టు విషయమై డిస్కస్ చేస్తూనే ఉన్నాం...ఇద్దరం ఆశ్చర్యపోయాం...ఇలాంటి వార్తలు రాసేముందు దర్శకుడునో, హీరోనో ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని రాస్తే మంచిది కదా ," అన్నారు రాజశేఖర్.

ఇక ఫేస్ బుక్ ద్వారా దర్శకుడు తేజ ఈ చిత్రం కోసం నటులను అన్వేషిస్తునే ఉన్నారు. ఆ కాస్టింగ్ కాల్ ఇంకా పూర్తి కాలేదు. ఇక షూటింగ్ ప్రారంభమయ్యి, ఆగిపోవటమే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్తున్నారు యూనిట్ వర్గాలు. అదీ నిజమే కదా.

English summary
Denying rumours that Rajasekhar was out of director Teja’s Aham after a couple of day’s shooting due to differences between the two, the actor says that there’s nothing to it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu