For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవితో విభేదాలు సృష్టించొద్దు.. చెడుగా రాయొద్దు.. కంటతడి పెట్టిన రాజశేఖర్

  By Rajababu
  |
  చిరంజీవితో విభేదాలు సృష్టించొద్దు.. కంటతడి పెట్టిన రాజశేఖర్

  చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత హీరో రాజశేఖర్ మళ్లీ సక్సెస్ బాట పట్టారు. ఆయన నటించిన పీఎస్వీ గరుడ వేగ చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో ఇటీవల చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో రాజశేఖర్, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, హీరోయిన్లు పూజా కుమార్, శ్రద్ధాదాస్, జీవిత, చిత్ర సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.

   గరుడ వేగ సూపర్ డూపర్ హిట్

  గరుడ వేగ సూపర్ డూపర్ హిట్

  పీఎస్వీ గరుడ వేగ చిత్ర కథను ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో గానీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. నా జీవితంలో ఇంత పెద్ద హిట్‌ నాకు లభించలేదు. ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన నిర్మాత మల్కాపురం శివకుమార్ బ్లాక్ బస్టర్ కంటే పెద్ద హిట్ అని చెప్పడం ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో స్పష్టమవుతున్నది.

   అంకుశం సినిమా మాదిరిగానే..

  అంకుశం సినిమా మాదిరిగానే..

  గతంలో నేను నటించిన అంకుశం నటించిన చిత్రం కూడా ఇలాంటి ఫీలింగ్ కల్పించింది. తమిళంలో ఆ చిత్రాన్ని సొంతంగా రిలీజ్ చేయగా పెద్ద హిట్ అయింది. దాని కంటే గరుడ వేగ చిత్రం సక్సెస్ అయింది.

   అద్భుతంగా తెరకెక్కించారు

  అద్భుతంగా తెరకెక్కించారు

  స్క్రిప్ట్ మీద దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఏం రాశారో.. అంతే మొత్తంగా అద్భుతంగా తెరకెక్కించారు. కథను ఎగ్జిక్యూట్ చేసిన విధానం సూపర్. ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా చిత్రీకరించారు.

   జీవిత గిఫ్ట్ ఇచ్చింది..

  జీవిత గిఫ్ట్ ఇచ్చింది..

  గరుడ వేగ చిత్రం సక్సెస్ వెనుక ఉన్నవారిలో నా సతీమణి జీవిత ఒకరు. జీవిత లేకుంటే ఈ సినిమా ఇక్కడ వరకు రాకపోయేది. గరుడ వేగ చిత్రాన్ని జీవిత నాకు గిఫ్ట్‌గా ఇచ్చింది. నా భర్తకు మంచి సక్సెస్ ఇవ్వాలన్న కోరికతో చాలా కష్టపడింది.

   కంటతడి పెట్టిన రాజశేఖర్

  కంటతడి పెట్టిన రాజశేఖర్

  గరుడ వేగ చిత్ర సక్సెస్ మీట్‌లో పెట్టిన తన తల్లి, బావమరిది ఫోటోలను చూసి రాజశేఖర్ ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టుకొన్నారు. ఇటీవల రాజశేఖర్ తల్లి, బావ మరిది మరణించిన సంగతి తెలిసిందే. వారిని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. జీవితంలో అండగా ఉంటారు అనుకొనే లోపునే వారు దూరమయ్యారు అని రాజశేఖర్ బాధపడ్డారు.

  గరుడ వేగపై డౌట్ వచ్చింది

  గరుడ వేగపై డౌట్ వచ్చింది

  ఇలా అనేక చెడు శకునాలు వస్తుండటంతో గరుడు వేగ సినిమా సక్సెస్ లభించదు అని అనుకొన్నాను. చెన్నైలో ఓ వైపు తుఫాను, నాకు అనేక అవాంతరాలు రావడం చూసి చాలా బాధపడ్డాను. కానీ నా పరిస్థితి చూసి ప్రజలందరూ సానుకూలంగా స్పందించి ఈ సినిమాను పెద్ద హిట్ చేశారు. ప్రేక్షకులు తమ తల్లిదండ్రులను తీసుకొచ్చి చూపించడం చాలా ఆనందంగా ఉంది.

   చిరంజీవికి థ్యాంక్స్

  చిరంజీవికి థ్యాంక్స్

  గరుడ వేగ సినిమా చూసి మమ్మల్ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవికి చాలా థ్యాంక్స్. ఆయన స్వయంగా ఇంటికి బొకే పంపించారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. చిరంజీవితో కొన్ని విభేదాలు వచ్చిన తర్వాత మళ్లీ కలుసుకొన్నాం.

  చిరంజీవి గురించి అలా రాయొద్దు

  చిరంజీవి గురించి అలా రాయొద్దు

  ఇటీవల చిరంజీవిని కలిసి రాజశేఖర్ సారీ చెప్పుకొన్నాడు. అందుకే సినిమా పెద్ద హిట్ అయింది అని కొన్ని వెబ్‌సైట్లు రాశాయి. రాజశేఖర్‌కు ఇప్పుడు బుద్ది తెచ్చుకొన్నాడు అని చెడుగా రాశారు. విభేదాల తర్వాత చిరంజీవితో మంచిగా ఉండాలని కోరుకొంటున్నాం. మీరు కూడా మేము మంచిగా ఉండాలని కోరుకోరా.. అలాంటి వార్తలు రాయవద్దు అని రాజశేఖర్ రిక్వెస్ట్ చేశారు.

  English summary
  PSV Garuda Vega's hero Rajasekhar gets emotional in movie success meet. His eyes becomes full of tears while remembering his passed mother and brother in law. Rajasekhar conveyed Thanks to megastar Chirajeevi for giving great applause for Garuda vega movie. He also request to not write gossips on his relation with Chiranjeevi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X