»   » కామ్రేడ్ అంటే మంచి మిత్రుడు: రాజశేఖర్

కామ్రేడ్ అంటే మంచి మిత్రుడు: రాజశేఖర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజశేఖర్ నటించిన చివరి స్ట్రెయిట్ సినిమా ఏది? అని అడిగితే మనమే కాదు చివరకు రాజశేఖర్, జీవిత కూడా సమాధానం కోసం కనీసం అయిదారు నిముషాలైనా తడుముకుంటారంటే అతిశయోక్తి లేదు. రీమేక్ సినిమాలకి అంతగా అలవాటు పడిపోయి తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు కూడా తీస్తుంటారనే సంగతి మరచిపోయిన రాజశేఖర్ తన రీమేక్ స్రవంతికి ఎట్టకేలకు బ్రేకేశాడు.

'సత్యమేవ జయతే", 'నా స్టైలే వేరు" లాంటి రీమేకులు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోవడంతో అతనీ నిర్ణయం తీసుకున్నట్టున్నాడు. ఏదేతేనేం అచ్చ తెలుగు కథతో ఆంధ్రా అల్లుడు రాజశేఖర్ 'కామ్రేడ్" గా 'అసాధ్యుడు" దర్శకుడు అనిల్ దర్శకత్వంలో వస్తున్నాడు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, కామ్రేడ్ అంటే ఒక మంచి మిత్రుడు అనే అర్ధం ఉందనీ, ఆ లైన్స్ లో ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చారనీ చెప్పారు. కథ దొరక్కే కొద్దిరోజులు గ్యాప్ తీసుకున్నప్పటికీ ఇప్పుడు మంచి సబ్జెక్ట్ దొరికిందని అన్నారు. నేటి వర్తమాన పరిస్ధితిలను ప్రతిబింబిస్తూ చక్కటి సందేశం కూడా ఈ చిత్రంలో ఉంటుందని చెప్పారు. తన కెరీర్ లో ఇదొక మంచి చిత్రమవుతుందని పేర్కొన్నారు. ఈ సినిమా హిట్టయి రాజశేఖర్ కి మళ్లీ ఒరిజినల్ స్టోరీస్ పై ఇంట్రస్ట్ పెంచితే అదే పదివేలు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu