»   » కేసీఆర్‌తో జీవితరాజశేఖర్, ఆ సినీ ఫ్యామిలీస్‌పై ఫిర్యాదు!

కేసీఆర్‌తో జీవితరాజశేఖర్, ఆ సినీ ఫ్యామిలీస్‌పై ఫిర్యాదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా కొన్ని కుటుంబాల ఆధిపత్యమే కొనసాగుతోందని తెలుగు సినీ నటులు జీవిత రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేసారు. వారి కబంధ హస్తాల నుండి పరిశ్రమను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అభిప్రాయ పడ్డారు. వారి ఆధిపత్యం మూలంగా చిన్న సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని అన్నారు.

గురువారం ఈ దంపతులు సచివాలయంలో కేసీఆర్‌ను కలిసారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.... సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా కొన్ని కుటుంబాల ఆధిపత్యం సాగుతోందని, వారి మూలంగా చిన్న సినిమాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వారి ఆధిపత్యాన్ని కట్టడి చేయాలని కేసీఆర్‌ను కోరినట్లు తెలిపారు. ఎవరి ఆధిపత్యం సాగనివ్వమని, అందరికీ మంచి జరిగేలా చూస్తాని కేసీఆర్ హామీ ఇవ్వడం సంతోషంగా ఉందని జీవితరాజశేఖర్ తెలిపారు.

Rajasekhar and Jeevitha Meets Telangana CM KCR

ఇదీ పరిస్థితి....
చిన్న సినిమాలు ఇబ్బంది పడటానికి ప్రధాన కారణం కొందరు వ్యక్తులు థియేటర్లను తమ గుప్పిట్లో పెట్టుకోవడమే. చిన్న నిర్మాతల ఊపిరి తీస్తున్న థియేటర్ల ఇబ్బంది ఎప్పటికీ తీరుతుందో తెలియని పరిస్థితి. ఇదంతా టాలీవుడ్‌ను శాసించే మాఫియా వ్యవహారంగా కనిపిస్తోంది. పరిశ్రమలో పేరున్న కొందరు థియేటర్లను తమ అడ్డాలుగా మార్చుకొని తమ ఇష్టానుసారంగా సినిమాలను ప్రదర్శిస్తున్నారు.

తమ వంశోద్ధారకుల చిత్రాలు విడుదలయ్యాయి అంటే ఎంత మంచి సినిమా ఆ థియేటర్‌లో ఆడుతున్నా మాయమైపోతుంది. ఈ పద్ధతివల్ల ఓ మంచి సినిమా ప్రేక్షకులకు చేరకుండానే వెళ్లిపోతోంది. సదరు చిత్ర నిర్మాత నెత్తినోరు బాదుకుంటూ ఎన్ని ఏడుపులు ఏడ్చినా పట్టించుకునేవారు లేరు.

పరిశ్రమలో పెద్దోళ్లుగా పేరొందిన ఆ నలుగురు థియేటర్లను తమ గుత్త్ధాపత్యంలో ఉంచుకొని వారు ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతోందని పలువురు చిన్న నిర్మాతలు తమ బాధాతప్త కంఠాలతో ఎలుగెత్తి చాటుతున్నారు. మరి రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు కొందరు చిన్న సినిమాల నిర్మాతలు.

English summary
Tollywood actors Rajasekhar and Jeevitha Met Telangana CM KCR to day at Secretariat.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu