»   » రాజశేఖర్ కూతురి కోసం సల్మాన్ ఖాన్ హీరోయిన్..అలియా భట్‌లా చేస్తుందా!

రాజశేఖర్ కూతురి కోసం సల్మాన్ ఖాన్ హీరోయిన్..అలియా భట్‌లా చేస్తుందా!

Subscribe to Filmibeat Telugu

సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాని సినీ అరంగేట్రానికి రంగం సిద్ధం అయింది. హిందీలో సూపర్ హిట్ అయిన టూ స్టేట్స్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభం అయింది. ఈ చిత్రానికి సంబందించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టూ స్టేట్స్ చిత్రంలో అలియా భట్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. తెలుగు రీమేక్ లో అలియాభట్ పాత్రని శివాని పోషించనుంది. శివాని పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

 రాజశేఖర్ కుమార్తెగా

రాజశేఖర్ కుమార్తెగా

రాజశేఖర్ కుమార్తెగా శివాని సినీరంగ ప్రవేశం చేయనుంది. తన కుమార్తెని హీరోయిన్ చేయాలని రాజశేఖర్ ఎప్పటినుంచో భావిస్తున్నాడు. ఎట్టకేలకు ఆ సమయం వచ్చింది. హిందీలో ఘనవిజయం సాధించిన టూ స్టేట్స్ చిత్ర తెలుగు రీమేక్ లో శివాని హీరోయిన్ గా నటించబోతోంది.

 అల్లరి పిల్లగా

అల్లరి పిల్లగా

శివాని చలాకీగా ఉండే అమ్మాయో లేక సైలెంట్ గా ఉండే అమ్మాయో ఎవరికీ అంతగా తెలియదు. అల్లరి పిల్ల అలియా భట్ పోషించిన పాత్రలో నటించడం అంటే శివానికి సవాల్ అని చెప్పొచ్చు.

అలియా భట్, అర్జున్ కపూర్ జంటగా

అలియా భట్, అర్జున్ కపూర్ జంటగా

టూ స్టేట్స్ చిత్రంలో అర్జున్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు. వీరి మధ్య కుదిరిన కెమిస్ట్రీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

 బెంగాలీ బ్రాహ్మణ అమ్మాయిగా

బెంగాలీ బ్రాహ్మణ అమ్మాయిగా

అలియా భట్ టూ స్టేట్స్ చిత్రంలో తమిళ బ్రాహ్మణ అమ్మాయిగా నటించింది. అర్జు కపూర్ పంజాబీ యువకుడిగా మెప్పించాడు. తెలుగులో అడవి శేష్ అర్జున్ కపూర్ పాత్రని పోషించనున్నారు. అడవి శేష్ ఈ చిత్రంలో తెలుగు యువకుడిగానే కనిపిస్తాడు. శివాని బెంగాలీ బ్రాహ్మణ అమ్మాయిగా నటించబోతోంది.

శివాని కోసం సల్మాన్ హీరోయిన్

శివాని కోసం సల్మాన్ హీరోయిన్

ప్రేమపావురాలు చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటించ అలనాటి నటి భాగ్య శ్రీ ఈ చిత్రంలో హీరోయిన్ తల్లి పాత్రలో కనిపించబోతుండడం విశేషం.

 అనూప్ సంగీతం

అనూప్ సంగీతం

ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. వెంకట్ కుంచం ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియనున్నాయి.

English summary
Rajasekhar's Daughter Shivani Turns Bengali Brahmin. Shivani will going to act in Two states remake
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X