For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంత జరిగినా రాజశేఖర్ కష్టాలు తీరనే లేదా..?? గరుడ వేగ సంతోషం సగమే

  |

  ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ అంటే బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ కి ఆ తర్వాత మన తాలీవుడ్ లో రాజ శేఖర్ కే అన్నట్టు ఉండేది. దాదాపు అగ్రహీరోల స్థాయిలో రాజశేఖర్ హవానడిచింది ఒకప్పుడు, ఆ తర్వాత కూడా సూపర్ హిట్ అవ్వకున్నా నిర్మాతలకు మినిమం గ్యారంటీ హీరోగా ఆయుధ, గోరింటాకు, ఎవడైతే నాకేంతీ లాంతి సినిమాలతోనూ ఎక్కడా బ్రేక్ తీసుకోలేదు.

  ఫ్లాపా హిట్టా అన్నది కూడా అవసరం లేదన్నట్టుగా సినిమాలు తీస్తూ పోయాడు. క్రమక్రమంగా రాజశేఖర్ మార్కెట్ చాలా తగ్గిపోయింది.అయితే దాదాపు హీరోగా ఇక కెరీర్ ముగిసిందీ అనుకున్న సమయం లో మళ్ళీ పీఎస్వీ గరుడవేగ తో ఒక్కసారి సూపర్ సక్సెస్ అందుకున్నాడు రాజశేఖర్... అయితే ఇప్పుడు కూడా యూఎస్ మార్కెట్ తప్ప ఇక్కడ పెద్దగా వసూళ్ళుసాధించలేదట.

  గరుడ వేగ

  గరుడ వేగ

  రాజశేఖర్ గరుడ వేగ మూవీకి యూఎస్‌లో అద్భుతమైన పికప్ లభించింది. గురువారం నాడు ప్రీమియర్లతో 28వేల డాలర్లు రాబట్టగా.. శుక్రవారం నాడు 64వేల డాలర్లకు వసూళ్లు పెరిగాయి. శనివారం నాడు అయితే ఏకంగా 106వేల డాలర్లు రావడం విశేషం.

  పెద్దగా అంచనాలు

  పెద్దగా అంచనాలు

  సండే కూడా జోరు చూపించిన ఈ చిత్రం 60వేల డాలర్లను రాబట్టి.. మొత్తంగా వసూళ్లను 2.62 లక్షల డాలర్లకు పెంచుకుంది. నిజానికి పెద్దగా అంచనాలు లేని ‘గరుడవేగ' సినిమా యుఎస్ హక్కుల్ని చాలా తక్కువ మొత్తానికే ఇచ్చేశారు. ఆ మొత్తం రూ.36 లక్షలని సమాచారం.

  క్లాస్ థ్రిల్లర్

  క్లాస్ థ్రిల్లర్

  ఐతే యుఎస్ తెలుగు ప్రేక్షకులు మెచ్చే క్లాస్ థ్రిల్లర్ కావడం.. టాక్ కూడా ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో అక్కడ అంచనాల్ని మించి వసూళ్లు వచ్చాయి. అయితే కేవలం యూఎస్ మార్కెట్ మాత్రమే ఇప్పుడు ముఖ్యం కాదుకదా.. మనదగ్గర బాగానే ఆడినా ఇప్పుడు ఇంకొన్నాళ్ళు ఇలాగే నిలబడితే తప్ప చేతుల్లో లాభాలని చూడలేరు...

  ఆర్థికంగా నష్టపోయాడు

  ఆర్థికంగా నష్టపోయాడు

  వరుస పరాజయాలతో కనుమరుగయ్యే స్థితికి వెళ్లిన రాజశేఖర్‌ ఈ టైమ్‌లో ఆర్థికంగా నష్టపోయాడు కూడా. అతను నిర్మించిన పలు చిత్రాలు విడుదలకి నోచుకోకుండా ఆగిపోయాయి. దీంతో గరుడవేగతో తాను మళ్లీ న్యూస్‌లోకి రావడాన్ని ఆయన చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు.

   కమర్షియల్‌గా చెప్పుకోతగ్గ స్థాయి రిటర్న్స్‌

  కమర్షియల్‌గా చెప్పుకోతగ్గ స్థాయి రిటర్న్స్‌

  ఈ క్రిటికల్‌ సక్సెస్‌తో ఎమోషనల్‌ అవుతోన్న రాజశేఖర్‌ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే ఈ చిత్రం కమర్షియల్‌గా చెప్పుకోతగ్గ స్థాయి రిటర్న్స్‌ తెచ్చుకోవడం లేదు. సోమ, మంగళవారాల్లో వసూళ్లు సాధారణంగానే వున్నాయి.

  థియేట్రికల్‌ రికవరీ

  థియేట్రికల్‌ రికవరీ

  మొదటి వీకెండ్‌లో మూడు కోట్ల అరవై లక్షల షేర్‌ మాత్రమే రావడంతో థియేట్రికల్‌ రికవరీకి మరో ఎనిమిది కోట్ల వరకు అవసరం. కానీ వసూళ్ల పరంగా ఈ చిత్రం స్లోగా వుండడంతో ట్రేడ్‌ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ చిత్రం ఓవర్‌ ఫ్లోస్‌ వస్తేనే రాజశేఖర్‌కి లాభాలు వస్తాయట.

  పదకొండు, పన్నెండు కోట్ల షేర్‌

  పదకొండు, పన్నెండు కోట్ల షేర్‌

  కానీ ప్రస్తుతానికి ఆ పదకొండు, పన్నెండు కోట్ల షేర్‌ వస్తుందా అనేది అనుమానంగా కనిపిస్తోంది. థియేటర్ల పరంగా పట్టు లేకపోవడం ఈ చిత్రానికి ఇబ్బందిగా పరిణమిస్తోందని భావిస్తున్నారు. ఈవారంలో చాలా సినిమాలున్నాయి కనుక థియేటర్లు పెద్దగా పెరిగే అవకాశం కూడా లేదట.

   నష్టాలు రాకుండా

  నష్టాలు రాకుండా

  ఇంత కష్టపడి మంచి చిత్రం తీసినందుకు కేవలం ప్రశంసలు కాకుండా నష్టాలు రాకుండా వడ్డీతో సహా వసూలైపోతే బాగుంటుంది కదా. అందులోనూ సొంత ఫ్లాట్ దగ్గరినుంచీ తాకట్టు పెట్టి మరీ ఈ సినిమాని బతికించుకున్నాడు రాజశేఖర్ కనీసం ఆ కష్టానికి కూడా ఫలితం ఉండాలి కదా....

  English summary
  PSV Garuda Vega starring Rajasekhar, a Praveen Sattaru directorial Movie collections got slow from 4th Day Garuda Vega not collecting as expected.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X