»   » హమ్మయ్య అనుకున్నాడేమో..: గడ్డం, మీసాలు తీసేసిన పవన్ (ఫొటోలు)

హమ్మయ్య అనుకున్నాడేమో..: గడ్డం, మీసాలు తీసేసిన పవన్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశం లో చాలా చోట్ల పవన్ మ్యానియా నడుస్తోంది. తెల్లారితే సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్. ఈ నేపధ్యంలో పవన్ ..మీసాలు తీసేసి ఫ్రెష్ లుక్ తో కనిపించి అందరినీ ఆశ్యర్యపరిచారు.

Rajeev Masand interviews Pawan Kalyan!!

పవన్ తన చిత్రం హిందీలో కూడా రిలీజు అవుతూండటంతో ప్రమోషన్ లో భాగంగా.. బాలీవుడ్‌ మీడియాకు మాత్రమే ఇంటర్యూలు ఇస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ పవన్‌ని ఇంటర్వ్యూ చేయగా, వారితో దిగిన ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. ఇందులో పవన్ మీసం, గడ్డం లేకుండా సాఫ్ట్ లుక్‌లో కనిపించారు. ఈ ఇంటర్వూ సిఎన్ ఎన్ ఐబిన్ టీవి ఛానెల్ లో 7 వ తేదీ అంటే ఈ రోజు పది గంటలకు ప్రసారం అవుతుంది.

ఈ ఇంటర్వ్యూ కోసం తీయించుకున్న ఫోటోను రాజీవ్ మసంద్ తన ట్విటర్ లో పెట్టి పవన్ ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని అనేక విషయాలు తన ఇంటర్వ్యూలో చెప్పాడు అంటూ ఈరోజు ప్రసారం కాబోతున్న ఆ ఇంటర్వ్యూ పై కూడ అంచనాలు పెంచేసాడు.

Rajeev Masand interviews Pawan Kalyan!!

ఇక ఈ ఇంటర్వూ పవన్ ..ఫామ్ హౌస్ లోనే జరిగింది. ఈ ఇంటర్వూ అనంతరం రాజీవ్ మసంద్.. గతంలో అనుపమ చోప్రా అన్నట్లుగానే ..ఆయన గ్రేస్, హ్యూమిలిటీ, జ్ఞానానికి తల వంచుతున్నానంటూ రాసుకొచ్చారు.

English summary
Recently, Pawan Kalyan even gave an interview to a Hindi daily. And now, Bollywood's renowned film critic Rajeev Masand has interviewed Powerstar. Interview will be first aired on CNN IBN TV CHANNEL on 7th April 10 AM
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu