»   » అఖిల్ తండ్రిగా నటిస్తున్న రాజేంద్రప్రసాద్

అఖిల్ తండ్రిగా నటిస్తున్న రాజేంద్రప్రసాద్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని యంగ్ హీరో అఖిల్‌ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అఖిల్ తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ నటిస్తున్నాడు. ఒప్పుడు హీరోగా నటించిన రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం తన వయసుకు తగిన పాత్రలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ ‘సన్నాఫ్ సత్యమూర్తి', మహేష్ బాబు ‘శ్రీమంతుడు' చిత్రంలో నటిస్తున్నాడు.

అఖిల్ మూవీ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జోరుగా సాగుతోంది. అన్నపూర్ణా ఏడెకరాల్లో కుటుంబ సన్నివేశాలతో సహా కొన్ని కీలక ఘట్టాలను తీస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన యువ నటి సాయేషా సైగల్ వెండితెరకు పరిచయమవుతున్నారు. వెలిగొండ శ్రీనివాస్ అందించిన ఈ చిత్ర కథకు కోన వెంకట్ - గోపీమోహన్ జంట మాటలు సమకూరుస్తున్నారు.

Rajendra Prasad as Akhil's father

అఖిల్ చేస్తున్న ఈ చిత్రకథ ఒక సోషియో - ఫ్యాంటసీ అనీ, గతంలో చిరంజీవి - శ్రీదేవి జంటగా నటించిన ‘జగదేక వీరుడు - అతిలోక సుందరి'కీ దీనికీ పోలికలున్నాయనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు అఖిల్.

ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ పతాకపై నిఖిత రెడ్డి సమర్పణలో నితిన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు.

English summary
Rajendra Prasad will be seen as Akhil's father in Akhil Akkineni debut film in the direction of VV Vinayak.
Please Wait while comments are loading...