»   »  అమ్మకు... "మా" సంతాపం.... తెలుగుసినీ నటుల సంఘం, రాజేంద్ర ప్రసాద్

అమ్మకు... "మా" సంతాపం.... తెలుగుసినీ నటుల సంఘం, రాజేంద్ర ప్రసాద్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కథానాయికలు కూడా ప్రజానాయికలు అవుతారని ప్రపంచానికి నిరూపించిన ధీర వనిత జయలలిత అని సినీనటుడు, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. జయలలిత మరణం తమిళులకే కాకుండా తెలుగువారికి కూడా తీరని లోటన్నారు. పోరాటాల నుంచి విజయాలను చూసిన గొప్ప నాయకురాలని కొనియాడారు. ఆమె కడుపున పుట్టకపోయినా.. ఆమెను తాను తల్లిగానే భావిస్తానని తెలిపారు. సినీ రంగానికి ఆమె చేసిన సేవలను స్మరించుకుంటూ... మా అసోసియేషన్‌ తరపున ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

ఉదయమే మరికొందరు మా కార్యదర్షులు కూడా జయ లలిత చిత్ర పటానికి పూల మాలలు వెసి నివాళులర్పించారు. ఈ సంధర్భంగా మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజా ల స్పందన ఇక్కడ.

 మ‌హానాయ‌కురాలు:

మ‌హానాయ‌కురాలు:


రాజెంద్ర ప్రసాద్ చేసిన ప్రకటన లో ఇలా చెబుతూ గెలుపోట‌ముల్ని స‌మానంగా స్వీక‌రించిన ధీశాలి అమ్మ జ‌య‌ల‌లిత‌ మ‌హానాయ‌కురాలు. అంత‌కుమించి గొప్ప న‌టి. వృత్తి ఏదైనా ప్రవృత్తిలో విరోచితంగా పోరాడే ధీశాలి. త‌మిళనాడులో దిగువ తరగతి ప్రజలకు అమ్మ, మధ్య తరగతి ప్రజలకు పురచ్చితలైవి. గొప్ప విప్లవనాయకురాలు, త‌న‌ జీవితమంతా స్కూలు రోజుల నుండి పోరాటమయమే! అయినా అంచెలంచెలుగా ఒక మ‌హాశక్తిగా ఎదిగిన తీరు అంద‌రికి ఇన్‌స్పిరేష‌న్‌.

 రాజ‌కీయ నాయ‌కురాలిగా :

రాజ‌కీయ నాయ‌కురాలిగా :


ఈ ప‌య‌నంలో గెలుపోట‌ముల్ని స‌మానంగా తీసుకున్న గొప్ప ధీశాలి. మ‌హాన‌టులు ఎంజీఆర్‌, న‌ట‌సార్వభౌముడు, అన్నగారు ఎన్టీఆర్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించారు. ఏఎన్నార్ వంటి దిగ్గజం స‌ర‌స‌న న‌టించారు. సినీ నాయిక‌గా, రాజ‌కీయ నాయ‌కురాలిగా ఎన్నో మైలు రాళ్లు అందుకున్నారు.

 అమ్మకే చెల్లింది:

అమ్మకే చెల్లింది:


ఆరుసార్లు ఓ మ‌హిళ ముఖ్యమంత్రి అవ్వడం అన్నది ఓ చ‌రిత్ర. అది అమ్మకే చెల్లింది. అందుకే అమ్మ వెళుతున్నారు అంటే మ‌న‌సు త‌ట్టుకోలేక‌పోయింది. ఈ మ‌ర‌ణం తీర‌ని లోటు. అమ్మ ఆత్మకు శాంతి క‌ల‌గాల‌ని దేవుని ప్రార్థిస్తున్నానని రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

 శివాజీరాజా కూడా :

శివాజీరాజా కూడా :


‘మా' ప్రధాన కార్యద‌ర్శి శివాజీరాజా కూడా ఇలా స్పందించారు "అమ్మ స‌వాళ్లు ఎదుర్కొని ప్రస్థానం సాగించిన మ‌హిళా శ‌క్తి జ‌య‌ల‌లిత మ‌హిళా శ‌క్తి. పేద‌, మ‌ధ్యత‌ర‌గ‌తి ప్రజ‌ల పెన్నిధి. రాజ‌కీయాల్లో ఓ ప్రభంజ‌నం. అంత‌కుమించి గొప్ప న‌టిగానూ వెలిగిపోయారు. మ‌హామ‌హుల స‌ర‌స‌న నాయిక‌గా న‌టించారు.

 తీర‌నిలోటు:

తీర‌నిలోటు:


సినీ, రాజ‌కీయ ప్రస్థానంలో ఎన్నో స‌వాళ్లను ఎదుర్కొని మైలురాళ్లు అధిగ‌మించారు. మ‌న‌సున్న గొప్ప నాయ‌కురాలిగా ప్రజ‌ల మ‌న్నన‌లు అందుకున్నారు. తెలుగు, త‌మిళ సినీరంగంతో గొప్ప అనుబంధం ఉన్న అమ్మ నేడు లేరు అన్నది జీర్ణించుకోలేనిది. సినీ, రాజ‌కీయ రంగాల‌కు ఇది తీర‌నిలోటు. అమ్మ ఆత్మకు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుని ప్రార్థిస్తున్నాను.

English summary
Rajendra Prasad Who is Movie Artists Association President of Telugu, condolences to Jayalalitha
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu