»   » రాజేంద్రప్రసాద్ కొత్త కామెడీ చిత్రం విడుదల ఎప్పుడంటే...

రాజేంద్రప్రసాద్ కొత్త కామెడీ చిత్రం విడుదల ఎప్పుడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజేంద్రప్రసాద్, సుహాసిని ప్రధాన పాత్రధారులుగా ఉషాచరణ్ క్రియేషన్స్ పతాకంపై దినేష్‌బాబు దర్శకత్వంలో జొన్నాడ రమణమూర్తి నిర్మిస్తున్న చిత్రం "భలే మొగుడు భలే పెళ్లాం". ప్రస్తుతం ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 25న విడుదలకు సిద్ధమైంది. నిర్మాత జొన్నాడ రమణమూర్తి మాట్లాడుతూ- కుటుంబ కథ, హాస్య చిత్రంగా దర్శకుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజేంద్రప్రసాద్, సుహాసినిల హాస్యం సరికొత్తగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఇన్‌కంటాక్స్ ఆఫీసర్‌గా హీరో, ఆయన భార్య బ్యాంక్ ఉద్యోగిగా ఉంటే వారిమధ్య సమస్యలు ఎలా ఉంటాయి అనే సున్నితమైన హాస్యంతో ఈ చిత్రాన్ని నిర్మించాము అన్నారు. ఇక దర్శకుడు దినేష్ బాబు...తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 32 చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా వందకు పైగా చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసారు. రఘుబాబు, సూర్యతేజ్, హర్షవర్ధన్, ఝాన్సీ, రజిత, రమ్యశ్రీ, శిల్ప, ఉషశ్రీ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: గంగోత్రి విశ్వనాథ్, సంగీతం: ఇ.ఎస్.మూర్తి, ఎడిటింగ్: మురళీ రామయ్య, నిర్మాత: జొన్నాడ రమణమూర్తి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దినేష్ బాబు.

English summary
Rajendra Prasad and Suhasini pairing up for the first time under Usha charan Creations Banner is titled as “Bhale Pellam Bhale Mogudu”. Ace Kannada Director Dinesh Babu is directing this flick. The movie revolves between these two couples and how they overcome all the issues that comes on their way will surely entertain the audience. The film is expected to release on 25 th Feb.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X