»   » తాతైన రాజేంద్రప్రసాద్..మనుమరాలితో (వీడియో)

తాతైన రాజేంద్రప్రసాద్..మనుమరాలితో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : డా.రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో ఉషాకిరణ్‌ మూవీస్‌, ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దాగుడుమూత దండాకోర్‌'. ఆర్‌.కె. మలినేని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రామోజీరావు నిర్మాత. క్రిష్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు ఇ.ఎస్‌. మూర్తి స్వరాలు సమకూర్చారు. రామోజీ ఫిలింసిటీలో పాటల్ని విడుదల చేశారు. రామోజీరావు ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ ని మీరూ చూడండి. ఈ ట్రైలర్ లో తాత గెటప్ లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ ని చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడం ఆనందంగా ఉంది. ఎవరైనా జీవితంలో నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలంటారు. కానీ నేను నాలుగు సినిమాలు వెనకేసుకోవాలనుకుంటున్నాను. అందులో ‘దాగుడుమూత దండాకోర్‌' ఒకటి. చిరకాలం నిలిచే సినిమా అవుతుంది'' అని అన్నారు.

Rajendra Prasad Kicked About 'Daagudumoota Dandakor'

క్రిష్‌ మాట్లాడుతూ ‘‘దర్శకుడికిది తొలి సినిమా అయినప్పటికీ అలాంటి భావన ఎక్కడా కనబడనీయకుండా హృద్యంగా తెరకెక్కించారు. సరికొత్త వరవడిని సృష్టించే గొప్ప సినిమా అవుతుంది'' అని అన్నారు.

‘‘మానవ సంబంధాల్లో మృగ్యమైపోతున్న ఆత్మీయతల్ని, అనుబంధాల్ని స్పృశించేలా ఉన్నత విలువలతో కూడిన చిత్రమిది. మన జీవితాలకు దగ్గరగా ఉంటుంది. ఫిబ్రవరి రెండో వారంలో సినిమాను విడుదల చేస్తాం'' అని దర్శకుడు చెప్పారు.

English summary
Veteran actor Rajendra Prasad, who will be next seen as a grandfather in the upcoming Telugu drama "Daagudumoota Dandakor", is excited about the film as he feels it will be one of the memorable roles of his career. "Daagudumoota Dandakor" is the remake of last year's critically acclaimed Tamil film "Saivam".
Please Wait while comments are loading...