»   » జాలిపడి నా సినిమా చూడొద్దు

జాలిపడి నా సినిమా చూడొద్దు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: యువతలో మార్పు తీసుకువచ్చే సందేశాత్మకమైన చిత్రం ఓనమాలు అని.. ఇలాంటి మంచి చిత్రాలను అందరూ ఆదరించి, ప్రోత్సహించాలన్నారు. జాలిపడి ఈ సినిమా చూడవద్దని నటుడు రాజేంద్ర ప్రసాద్ కోరారు. తన తండ్రి ఆశీర్వాదంతోనే ఈ చిత్రంలో నారాయణ మాస్టారుగా మీ ముందుకు వచ్చానని చెప్పారు.

ప్రముఖ సాంస్కృతిక సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 'ఓనమాలు సినిమాకు వందనం' అనే పేరుతో అభినందన సభ జరిగింది. "ఓనమాలు ఒక సినిమా కాదు జీవితం. పాఠశాలలో టీచర్ ఎలా ఉండాలో ఇందులో చక్కగా చూపించారు'' అని సాంస్కృతిక శాఖ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి అన్నారు.

'ఓనమాలు' సినిమాలో నటించిన నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి రమణాచారిముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కోటి, నటుడు కొండవలస లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

కొబ్బరి చెట్టు నీడ, ఆరు బయట భోజనం, కళకళలాడే లోగిలి... అమ్మ కమ్మదనం ఈ అద్భుతమైన అనుభూతులన్నీ నింపుకుని వచ్చిన సినిమాలు. జులై 7న విడుదలై మంచి జ్ఞాపకం లాంటి సినిమా అనే టాక్ తెచ్చుకుంది. రాజేంద్ర ప్రసాద్, కల్యాణి, గిరిబాబు, చలపతిరావు, రఘుబాబు తదితరలు నటించిన ఈచిత్రానికి దర్శకత్వం: క్రాంతి మాధవ్, కథ: తమ్ముడ సత్యం, సినిమాటోగ్రఫీ: హరి అనుమోలు, సంగీతం: కోఠి, పాటలు: సిరివెన్నెల, మాటలు: ఖదీర్ బాబు, ఎడిటింగ్: గౌతం రాజు.

English summary
KV Ramanachary who was Advisor of Cultural Affairs, Government of Andhra Pradesh is said that 'Onamalu' is a good movie. Actor Rajendra Prasad says it is a message oriented film.
Please Wait while comments are loading...