»   » సిద్ధార్థ ‘బావ’ లో రాజేంద్రప్రసాద్!

సిద్ధార్థ ‘బావ’ లో రాజేంద్రప్రసాద్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిద్ధార్థ కథానాయకుడిగా శ్రీ కీర్తి కంబైన్స్ నిర్మిస్తున్న చిత్రం 'బావ". రాంబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి ఎమ్. పద్మ కుమార్ చౌదరి నిర్మాత. ఈ సినిమాలో ప్రముఖ కథానాయకుడు రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్రకు ఎంపికయ్యారు. సిద్ధార్థ తండ్రి పాత్రను ఇందులో ఆయన పోషించనున్నట్టు తెలుస్తోంది. ఆయన పాత్ర ప్రేక్షకులకు తప్పకుండా గుర్తుండి పోతుందని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ 'మా చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ నటించేందుకు అంగీకరించడం ఆనందంగా వుంది. నేను బాల నటుడుగా ఆయన చిత్రాల్లో నటించాను.

ఇప్పుడు నా తొలి చిత్రంలో ఆయన కీలక పాత్ర ధారి కావడంతో సంతోషంగా ఉంది. సిద్దార్థ, రాజేంద్రప్రసాద్ లపై వచ్చే సన్నివేశాలు వినోదాత్మకంగా ఉంటూనే, హృదయాన్ని హత్తుకుంటాయన్నారు. బావా మరదళ్ల మధ్య జరిగే ప్రేమకథా ఇతివృత్తంగా రొమాంటిక్ విలేజ్ బ్యాక్ డ్రాప్ తో 'బావ" చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రం ద్వారా ఓ కొత్త కన్నడ హీరోయిన్ ప్రనిత పరిచయం చేయబోతున్నారు మరియు మరో కథానాయిక పాత్రలో బోణి ఫేం క్రితి కర్భందా నటించనున్నారు. ఈ నెల 15 నుంచి రాజమండ్రి పరిసరాల్లో చిత్రీకరణ సాగిస్తామన్నారు. ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ఆలీ, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, నాజర్, రజిత, సురేఖా వాణి తదితరులు నటిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu