twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజేష్ ఖన్నా ఇల్లు 'ఆశీర్వాద్'ను మ్యూజియంగా మార్చే అవకాశం..!

    By Nageswara Rao
    |

    బాలీవుడ్ తొలితరం సూపర్ స్టార్ రాజేష్ కన్నా కోరిక మేరకు బాంద్రాలోని ఆయన బంగ్లా 'ఆశీర్వాద్'ను మ్యూజియంగా మార్చే అవకాశాలున్నట్లు ఆయన సన్నిహితుడొకరు చెప్పారు. ఐతే ఈ బంగ్లాను మ్యూజియంగా మార్చే విషయంలో తుది నిర్ణయం ఆయన కూతుళ్లు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నాలే తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాజేష్ ఖన్నా మరణానంతరం తన బంగ్లాని మ్యూజియంగా మార్చాలని కోరుకున్నట్లు సమాచారం.

    ఇది గనుక జరిగితే దేశంలో ఒక హీరోకి మ్యూజియం పెట్టడం ఇదే మొదటిసారి అవుతుంది. రాజేష్ ఖన్నా పెద్ద కూతురు ట్వింకిల్ ఖన్నా హీరో అక్షయ్ కుమార్‌ని వివాహాం చేసుకున్నారు. ఇక రింకీ కూడా లండన్‌లో నివసిస్తున్నారు. కాబట్టి వారికి ఈ బంగ్లాలో నివసించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఈ బంగ్లాను మ్యూజియంగా మార్చితే ఇందులో సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాకు చెందిన దుస్తులు, కార్లు, ఆయనకు వచ్చిన జ్ఞాపికలు వంటివి ఉంటాయని చెప్పారు. దీనికి 'రాజేష్ ఖన్నా మ్యూజియం' అని పేరు పెట్టాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు.

    69 సంవత్సరాల వయసు కలిగిన రాజేష్ ఖన్నా బుధవారం కాలేయ వ్యాధితో కన్నుమూసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 10 గంటలకు రాజే ష్ ఖన్నా నివాసం 'ఆశీర్వాద్' నుంచి ఆయన అంతిమ యాత్ర మొదలై.. తెల్లని పూలతో అలంకరించిన ఓపెన్ ట్రక్కులో ఆయన భౌతిక కాయాన్ని ఉంచగా.. ఆయన భౌతిక కాయం చెంత రాజేష్ ఖన్నా భార్య డింపుల్ కపాడియా, అల్లుడు అక్షయ్ కుమార్, చిన్న కుమార్తె రింకీ ఖన్నా ఉన్నారు.

    చివరి అంత్యక్రియలు అశేష అభిమానులు, ఫ్యామిలీ ప్రెండ్స్, సన్నిహితులు, బాలీవుడ్ అతిరథ మహారధులు మధ్య ఎంతో భారమైన హృదయాలతో వెంటరాగా విలే పార్లే స్మశాన వాటికలో తన మనవడు ఆరవ్ ద్వారా నిర్వహించబడ్డాయి. తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన ఆరవ్ తన తండ్రి అక్షయ్ కుమార్ సహాయంతో చితి కాగడాని రాజేష్ ఖన్నా శరీరానికి అంటించారు. బాలీవుడ్ చిత్ర రంగంలో 1969లో తారాస్దాయికి చెందిన ఈ సూపర్ స్టార్ శరీరం అందరూ చూస్తుండగా కాలిపోయింది.

    రాజేష్ ఖన్నా అంత్యక్రియలకు బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, మనోజ్ కుమార్, రాణీ ముఖర్జీ, కరణ్‌జోహర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమితాబ్ కన్నీటి పర్యంతమయ్యారు. అంత్యక్రియల సమయంలో రోదిస్తున్న డింపుల్, రింకీలను హత్తుకుని.. వారిని ఓదార్చారు.

    ''టైమయిపోయింది.. ప్యాకప్''.. కన్నుమూసే ముందు రాజేష్ ఖన్నా అన్న చివరి మాటలివీ.. ఈ విషయాన్ని బిగ్ బి అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. నివాళులు అర్పించడానికి బుధవారం మధ్యాహ్నం తాను రాజేష్ ఖన్నా నివాసానికి వెళ్లినప్పుడు.. ఆయన సన్నిహితుడొకరు తనకీ విషయాన్ని తెలిపినట్లు అమితాబ్ తన బ్లాగులో పేర్కొన్నారు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Late superstar Rajesh Khanna's bungalow will reportedly be converted into a museum as per his daughters' wish.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X