»   » రజనీ 'విక్రమసింహ' పాట విడుదల

రజనీ 'విక్రమసింహ' పాట విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'సూపర్‌స్టార్‌' రజనీకాంత్‌ తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో నటిస్తున్న 'విక్రమసింహ'(కోచ్చడయాన్‌) సినిమాలోని ఒక పాట సోమవారం ఇంటర్నెట్‌ ద్వారా విడుదల చేశారు. హాలీవుడ్‌ అనుసరిస్తున్న మోషన్‌ క్యాప్చర్‌ సాంకేతికతతో 'విక్రమసింహ'ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన చిత్ర టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఇదిలాఉండగా సినిమాలో 'చూద్దాం ఆకశం అంతం.. వేద్దాం అక్కడే పాదం..' అంటూ సాగే పాటను సోమవారం విడుదల చేశారు. మిగిలిన పాటల్ని ఈ నెల 10న విడుదల చేస్తున్నారు.


ఈ పాటతోసాగే ప్రచార చిత్రం రజనీకాంత్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. తమిళంలో 'ఎంగే పోగుదు వానం..' అనే ఈ పాటను సీనియర్‌ గేయ రచయిత వైరముత్తు(తమిళంలో) రాశారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. మిగిలిన పాటలను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలందించారు. దీపికా పదుకొణె కథానాయిక. సునీల్‌ లుల్ల నిర్మాత.

ఎరోస్‌ ఇంటర్నేషనల్‌, మీడియా ఒన్‌ గ్లోబల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'చూద్దాం ఆకాశం అంతం...' అంటూ సాగే పాటని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎ.ఆర్‌.రెహమాన్‌ గానం చేశారు. రజనీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రం 'కొచ్చడయాన్'. పూర్తిగా త్రీడీ రూపంలో వస్తోన్న ఈ చిత్రం తెలుగులో 'విక్రసింహా'గా అనువాదమౌతోంది.


దర్శకుడు కె.ఎస్. రవికుమార్ పర్యవేక్షణలో రజనీ చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించగా...ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ లుల్లా, సునందా మురళి మనోహర్, మురళి మనోహర్ నిర్మాతలు. దేశంలోనే తొలిసారిగా హాలీవుడ్ మూవీ అవతార్ తరహాలో మోషన్ కాప్చర్ టెక్నాలజీతో 3డి ఫార్మాట్‌లో ....ఇండియాలో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడుగా రాజీవ్‌ మీనన్‌ పని చేసారు. తెలుగులో ఈచిత్రాన్ని 'విక్రమ సింహా' పేరుతో విడుదల చేస్తున్నారు.


దేశీయ బాషలైన హిందీ, తెలుగు, తమిళంతో పాటు ఇంగ్లీష్, రష్య, జపాన్, చైనా బాషలలో విడుదలవుతుంది. 3డిలో రూపొందుతున్న ఈచిత్రం యానిమేషన్, గ్రాఫిక్స్ తో విజువల్ ట్రీట్‌లా ఉంటుందని యూనిట్ సభ్యులు తెలిపారు. శరత్‌కుమార్, శోభన, నాజర్, ఆది పినిశెట్టి, జాకీ ష్రాఫ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, జపనీస్ భాషల్లో వచ్చే దీపావళి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్ హీరో కావడం, అవతార్ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ పని చేస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

English summary
Rajinikanth’s next movie, Vikram Simha introduction song released in a special event on October 7th. The song goes like “Choodham Aaksam Antham” was crooned by SP Bala Subrahmanyam. The audio launch of the movie will take place on 10th October and the movie will hit the screens on December 12th on the occasion of Rajinikanth’s Birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more