»   » తండ్రీకొడుకులుగా రజనీకాంత్ అదుర్స్

తండ్రీకొడుకులుగా రజనీకాంత్ అదుర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'కోచ్చడయాన్‌'. తెలుగులో 'విక్రమసింహ'గా రూపుదిద్దుకుంటోంది. చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణాంతర పనుల్లో అర్ధాంతరంగా ఆగిపోయిందని రెండురోజులుగా కోలీవుడ్‌లో వివాదాస్పద వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై చిత్రబృందం స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని నిర్మాత డాక్టర్‌ మురళీమనోహర్‌ పేర్కొన్నారు.

సూపర్‌స్టార్‌ ఇందులో తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. కేఎస్‌ రవికుమార్‌ పర్యవేక్షణలో రజని చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. 'ఫొటో రియాలిస్టిక్‌ ఫెర్ఫామెన్స్‌ క్యాప్చరింగ్‌' అనే కొత్త సాంకేతికతతో తీర్చిదిద్దుతున్నారు. . ఏడాది ఆఖరుకు తప్పకుండా తెరపైకి వస్తుందని చెప్పారు.

ఈ సందర్భంగా మనోహర్‌ మాట్లాడుతూ ...కోలీవుడ్‌ చరిత్రలోనే 'కోచ్చడయాన్‌' అతిపెద్ద ప్రయత్నం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. రజనీకాంత్‌ నవ యువకుడిగా కనిపిస్తారు. విడుదల తేదీని అక్టోబరులో ప్రకటిస్తాం. ఏడాది ఆఖరుకు తప్పకుండా తెరపైకి వస్తుందని చెప్పారు.

'విక్రమ్ సింహా ' మిగతా విశేషాలు స్లైడ్ షోలో..

బడ్జెట్ ఎంత

బడ్జెట్ ఎంత

జేమ్స్‌ కేమరూన్‌ దర్శకత్వం వహించిన 'అవతార్‌', స్పీల్‌బర్గ్‌ దర్శకత్వంలోని 'టిన్‌ టిన్‌' వరుసలో 'కోచ్చడయాన్‌' కూడా చేరుతుంది. అవి రెండు రూ.2వేల కోట్లతో నాలుగేళ్లపాటు తెరకెక్కించారు. 'కోచ్చడయాన్‌'ను రూ.125 కోట్లతో రెండేళ్లలో పూర్తిచేశాం అని నిర్మాత తెలిపారు.

ఎంతవరకూ వచ్చింది

ఎంతవరకూ వచ్చింది

ఈ చిత్రానికి ప్రస్తుతం గ్రాఫిక్స్‌, ఆధునిక సాంకేతిక జోడింపు పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చిత్ర ద్వితీయార్థానికి రజనీకాంత్‌ డబ్బింగ్‌ చెప్పే పనులు సాగుతున్నాయి. 'సుల్తాన్‌ ది వారియర్‌' ప్రారంభించినప్పుడు ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం రాలేదు. అందువల్లే దాన్ని వదులుకున్నాం. 'కోచ్చడయాన్‌'లో కార్టూన్‌ సినిమాల్లా లాంటి ఫీల్‌ రాదు అంటున్నారు. ఇటీవలే లండన్‌లో విజువల్‌ ఎఫెక్ట్‌‌స వర్క్‌ పూర్తి చేశారు.

దీపికా హైలెట్

దీపికా హైలెట్

రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘కోచ్చడయాన్‌'. దీపిక పదుకొనె హీరోయిన్. ఆమె పాత్ర సినిమాలో కీలకమై నిలుస్తుందని చెప్తున్నారు. ఆది పినిశెట్టి ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. రజనీకాంత్‌ తనయురాలు సౌందర్య ఆర్‌.అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగులో...

తెలుగులో...

తెలుగులో ఈ చిత్రాన్ని లక్ష్మి గణపతి ఫిలింస్‌ పతాకంపై బి.సుబ్రహ్మణ్యం అందిస్తున్నారు. తమిళ్‌, హిందీ, తెలుగు భాషలలో ఒకేసారి అంటే దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వెర్షన్‌కి ‘విక్రమ్‌ సింహా' అనే టైటిల్‌ని నిర్మాతలు ఖరారు చేసారు.

డబుల్ రోల్

డబుల్ రోల్

ఇందులో ఇద్దరు రజనీలు ఉంటారు. ఇందులో సీనియర్‌ రజనీయే 'కోచ్చడయాన్‌'. ఆయనో దళపతి. తమ దేశపు రాజుకు కోచ్చడయాన్‌ మంచి స్నేహితుడు. ఆ మిత్రుడి కోసం ప్రపంచాన్నే జయించి.. ఆ విజయాన్ని రాజుకు సమర్పించాలని ఉత్సాహపడే సైనికుడు. అంతేకాదు.. కోచ్చడయాన్‌ భరతనాట్య కళాకారుడు కూడా. యుద్ధంలో ఆక్రోశంగా, వీరోచితంగా పోరాడే కోచ్చడయాన్‌.. వెనువెంటనే అందమైన అభినయంతో నృత్యం చేస్తారు.

శోభన కూడా...

శోభన కూడా...

యుద్ధంలో ఆక్రోశంగా, వీరోచితంగా పోరాడే కోచ్చడయాన్‌.. వెనువెంటనే అందమైన అభినయంతో నృత్యం చేస్తారు. అలాంటి పాత్రకు ఎవర్ని హీరోయిన్ గా తీసుకుందామా.. అని ఆలోచించినప్పుడు అందరికీ తోచిన పేరు శోభన. అలాగే...ఇందులో తండ్రి 'కోచ్చడయాన్‌'.. కుమారుడు 'రాణా'. తండ్రిని మించిన తనయుడు. తండ్రితో పోల్చితే వందరెట్లు వేగంగా దూసుకుపోయే వ్యక్తి.

స్క్రిప్టు ఎవరంటే...

స్క్రిప్టు ఎవరంటే...

రజనీకాంత్ కు రెండు బ్లాక్‌బస్టర్‌ హిట్లను అందించిన కేఎస్‌ రవికుమార్‌ ఈ చిత్రానికి స్క్రిప్టు రాశారు. రెహమాన్‌ సంగీతం సమకూర్చిన ఆరు పాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అన్నివర్గాలను ఆకట్టుకునే బాణీలవి. దీపికా పదుకొనే హీరోయిన్ అనే విషయం అందరికీ తెలుసు. చిత్రంలో రెండో కథానాయికగా శోభన కనిపిస్తారు. ఆమెది కథాపరంగా ఎంతో కీలకపాత్ర అని సౌందర్య చెప్పుకొచ్చారమె.

మిగతా తారాగణం

మిగతా తారాగణం

శోభన, శరత్‌కుమార్‌, జాకీ ష్రాప్‌, నాజర్‌ ..ఇలా భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిన సంగతి తెలిసిందే. రజనీకాంత్‌ విభిన్న అవతారంలో కనిపించే పోస్టర్లు ఇప్పటికే అభిమానులు సహా ప్రేక్షకుల్లో వైబ్రేషన్‌ క్రియేట్‌ చేశాయి.

English summary

 The shooting of Rajinikanth and Deepika Padukone starrer Vikram Simha is completed and the first edited copy of the film was received well by the team. The movie, which was delayed due to the health concerns of the superstar, seems to be getting ready for the release in the later part of the year Deepavali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu