»   » ఊహించలేనంత బిజినెస్: ఆరువందల కోట్లు దాటిన రోబో 2.0

ఊహించలేనంత బిజినెస్: ఆరువందల కోట్లు దాటిన రోబో 2.0

Posted By:
Subscribe to Filmibeat Telugu

గజినీ, రౌడీ రాథోడ్ లాంటి దక్షిణాది సినిమాలు కాసుల వర్శం కురిపించినా బాలీవుడ్ కి దక్షిణాది సినిమాలంటే ఒకరకమైన చులకన భావమే ఉండేది. కానీ బాహుబలి వల్ల దక్షిణాది చిత్రాలపై ఉత్తరాది వాళ్లకి చిన్నచూపు పోయింది. ఒకే ఒక్క దెబ్బ బలంగా పడింది మన సినిమాల కోసం ఇప్పుడు ఉత్తర భారత దేశం కూడా ఎదురు చూస్తోంది. నార్తిండియన్ ప్రేక్షకులకి కూడా బాలీవుద్ ఇతివృత్తాలన్నీ బోర్ కొట్టాయి. డిఫరెంట్ గా ఉండే కథలూ, సరికొత్త బాడీ లాంగ్వేజ్ ఉన్న హీరోలకోసం చూస్తున్నారు.

అందుకే ఇప్పుడు తమిళ, తెలుగు ఇండస్ట్రీ నిర్మాతలూ, దర్శకులూ ఏమాత్రం వెనుకాడటం లేదు. రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న రోబో సీక్వెల్‌ ఖర్చు నాలుగొందల కోట్లు దాటిపోయిందని అంచనా. రెండు వందల కోట్ల బడ్జెట్‌లో తీద్దామని అనుకున్న ఈ చిత్రం ఇప్పుడు డబుల్‌ అయిపోయినా నిర్మాతలు ఏమాత్రం భయపడడం లేదు.

Rajinikanth, Akshay Kumar’s 2.0 makes ‘historic’ business

ఈ చిత్రానికి వస్తోన్న బిజినెస్‌ ఆఫర్లు చూస్తే విడుదలకి ముందే కనీసం ఆరు వందల కోట్లు చేతిలోకి వచ్చేలాగుంది. కేవలం శాటిలైట్‌, డిజిటల్‌ హక్కుల ద్వారానే 170 కోట్లు వస్తున్నాయంటే దీనిపై అంచనాలు ఏ స్థాయిలో వున్నాయో తెలుస్తోంది. తెలుగు వెర్షన్‌ రైట్స్‌ ఎనభై కోట్లు చెల్లించి ఎన్‌ఆర్‌ఏ పద్ధతిలో తీసుకున్నారు.

ఒక అనువాద చిత్రానికి ఈ రేటు ఇచ్చారంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌ వుండడం వల్ల బిజినెస్‌కి ఎలాంటి లోటు వుండదు. రజనీకాంత్‌, శంకర్‌ ఇద్దరూ నేషనల్‌ లెవల్‌ బ్రాండ్స్‌ కనుక,వారికి అక్షయ్‌కుమార్‌ తోడయి, అన్నిటికీ మించి ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై ఎప్పుడూ చూడని లెవల్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ వుంటాయనే సరికి '2.0' రైట్స్‌ తీసుకోవడం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. విడుదల సమయానికి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ పరంగా అత్యధిక రేటు పలికిన సినిమాగా రికార్డులకి తెర తీస్తుందేమో.

English summary
2.0 is director Shankar's most Ambitious film and is the sequel to 2010 blockbuster movie Enthiran. Lyca Productions have sold the Telugu theatrical rights in Andhra Pradesh and Telangana for a record price.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu