»   » అద్బుతం "టన్నెల్ ఆఫ్ లవ్" లో షూటింగా..!? అందుకే శంకర్ ఈ స్థాయి లో ఉన్నాడు

అద్బుతం "టన్నెల్ ఆఫ్ లవ్" లో షూటింగా..!? అందుకే శంకర్ ఈ స్థాయి లో ఉన్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

శంకర్ సౌత్ ఇండియన్ సినిమాలోనే కాదు టోటల్ జాతీయ స్తాయిలో ఒక స్థానం లో ఉన్న దర్శకుడు. మామూలుగా నే బాలీవుడ్ కి దక్షిణాది సినిమాలంటే ఉండే చిన్న చూపు పోయి కాస్త "భయం"కూడా పెంచిన స్థాయికి రావటానికి శంకర్ కూడా ఒక కారణం. ఎక్కడా రాజీ పడడు, ఏ విశయం లోనూ నిర్లక్ష్యం ఉండదు. క్వాలిటీ కోసం ఎంత ఖర్చైనా పెట్టగల నిర్మాతల తోనే కలిసి పని చేస్తాడు. ఆ పర్ఫెక్షన్ ఉంది కాబట్టే ఇవాల భారత దేశం లోనే అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో శంకర్ ఒకడు...

ప్రేమికుడు సినిమాలో గ్లాస్ బస్ సెట్ వేసినా - శివాజీ లో పూర్తి అద్దాలతోనే బిల్డింగ్ సెట్ వేసినా అపరిచితుడు కోసం తులిప్ గార్డెన్స్ లో షూట్ చేయటానికి మూడునెలలు ఆగి మరీ అనుకున్న చోటనే షూట్ చేసినా.., కిలిమంజారో అంటూ ఎన్నడూ షూట్ కి అనుమతివ్వని ప్రదేశంలో పాట తీసినా, ఐ సినిమాలో చైనా పూల అందాలని పరిచయం చేసినా అది శంకర్ కే చెల్లింది. అదే దారిలో ఇప్పుడు మరో అద్బుతమైన లొకేషన్ లో ఇంకో అద్బుతమైన సాంగ్ ని తీయబోతున్నాడు ఈ లావిష్ ఫిలిం మేకర్ ఆ వివరాలు...

రిచ్చెస్ట్ మేకింగ్ సాంగ్స్ :

రిచ్చెస్ట్ మేకింగ్ సాంగ్స్ :

సినిమా మొత్తం ఒకటైతే శంకర్ తీసే పాటలు మరోఎత్తు, ఒక్క పాటకి పెట్తించే ఖర్చు తో మామూలు చిన్న సినిమా తీసేయొచ్చు. అంత రేంజ్ లో ఉంటాయి. జీన్స్ సినిమాలో పాటలలో 7 వండర్స్ దగ్గర తీసిన ఒక్క పాట ఇప్పటికీ రిచ్చెస్ట్ మేకింగ్ సాంగ్స్ లో ఒకటి. ఎందుకు కేవలం ఒక్క పాటకే అంత ఖర్చు అని ఒక విలేఖరి అడిగితే... "ఒక మామూలు కుర్రాడే ప్రేమలో ఉన్నప్పుడు తాజ్ మహల్ దగ్గర ఊహించుకుంటాడు.

అంతా అవాక్కయ్యారు:

అంతా అవాక్కయ్యారు:

మరి అమెరికాలో ఉండే నా సినిమా హీరో ఒక అమెరికన్ సిటిజన్, అందులోనూ ఒక డాక్టర్ మరి అతను 7 వింతలను ఊహించుకోడూ అంటేనే ఆశ్చర్య పోవాలి గానీ... ఆ లొకేషన్లు ఉంటే ఎందుకు ఆశ్చర్యం ఎందుకు?? అంటూ ఎదురు ప్రశ్న వేసాడు... ఈ సినిమా మొత్తం లోనూ హీరోలిద్దరూ అమెరికాలోనే పెరిగిన వాళ్ళూ, భావుకులు కూడా మరి అంత తెలివైన వాడు మామూలు ప్రదేశాలని ఊహించుకోవటం సూటవదు కదా..!" అనగానే అంతా అవాక్కయ్యారు.

అపరిచితుడు లో :

అపరిచితుడు లో :

తాను చిత్రించే సినిమాలోని పాత్రలలో ఎంతగా పరకాయ ప్రవేశం చేసి మరీ ఆ పాత్రలని తీర్చిదిద్దుతాడో చెప్పకనే చెప్పాడు. అపరిచితుడు లో తులిప్ తోటలో మరీ సాంప్రదాయబద్దంగా కనిపించే హీరో విశయం లో కూడా అతని ఊహలు రిచ్ గా ఉన్నా అతని ఊహలు వేరుగా ఉంటాయంటూ చెప్పి తాను చేసే ప్రతీ చిన్న విషయం వెనుకా ఎంత పర్ఫెక్ట్ ఆలోచన ఉంటుందో చెప్పాడు. దటీజ్ శంకర్....

టన్నెల్ ఆఫ్ లవ్:

టన్నెల్ ఆఫ్ లవ్:

ఇప్పుడు శంకర్ మరోసారి అటువంటి వైవిధ్యమైన ప్రదేశంలో చిత్రీకరణ జరుపుతున్నట్టు సమాచారం. ప్రకృతి అందించిన వరంగా భావించే "టన్నెల్ ఆఫ్ లవ్" అనే ప్రదేశంలో రజినీకాంత్ అమీ జాక్సన్ నటిస్తున్న 2.0 షూటింగ్ జరపనున్నారు. ఈ సినిమాలో ఓ పాట కోసం యూనిట్ అంతా ఉక్రెయిన్ చేరౌతోంది. అక్కడ టన్నెల్ ఆఫ్ లవ్ అనే ప్రాంతంలో ఓ పాటను షూట్ జరుగుతోంది.

పొరపాటు పడినట్లే:

పొరపాటు పడినట్లే:

ఉక్రెయిన్ లోని క్లెవాన్ సమీపంలో ఉన్న ‘టన్నెల్ ఆఫ్ లవ్'కు వెళితే అక్కడి నుంచి కదలబుద్ధి కాదు. ముఖ్యంగా ప్రేమికులకు అయితే, ఇది సరైన ప్లేస్. ఎందుకంటే, చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చదనం.. కావలసినంత ఏకాంతం వుంటాయి. ఇంతకీ, ‘టన్నెల్ ఆఫ్ లవ్' అంటే ఏమనుకుంటున్నారు. అదేదో పార్కో లేక ఉద్యానవనమో అనుకుంటే పొరపాటు పడినట్లే.

సైనిక సామగ్రిని రహస్యంగా తరలించుకునేందుకు:

సైనిక సామగ్రిని రహస్యంగా తరలించుకునేందుకు:

ఎందుకంటే, ‘టన్నెల్ ఆఫ్ లవ్' అనేది ఒక రైల్వే ట్రాక్. సుమారు 3 కిలోమీటర్ల మేర ఉండే ఈ రైల్వేట్రాక్ ఇప్పటి కాదు. సైనిక సామగ్రిని రహస్యంగా తరలించుకునేందుకు దశాబ్దాల క్రితం ఈ ట్రాక్ ను ఏర్పాటు చేశారు. అందుకే, ఆ ట్రాక్ చుట్టూ మొక్కలు పెంచారట అప్పట్లొ..

లవర్స్ అడ్డా:

లవర్స్ అడ్డా:

చుట్టూ పొదలుగా అల్లుకన్న పచ్చని చెట్లు. సొరంగం మాదిరి ఉన్న ఆకృతి. బయట సూర్యుడు తన ప్రతాపాన్ని తెగ చూపిస్తున్నా ఏ మాత్రం బయపడరు ఇక్కడ ఉంటే. లవర్స్ అడ్డా అంటే ఇలా ఉండాలని అందరూ అనుకుంటున్న ఈ ప్రాంతం ఏ పార్కో కాదు. అలా అని అడవి కూడా కాదు. ఇది ఓ రైల్వే ట్రాక్. ఏంటీ నమ్మలేకున్నారా..? ఉక్రెయిన్‌లోని క్లెవాన్ సమీపంలో ఉన్న టన్నెల్ ఆఫ్ లవ్ పేరుతో పిలిచే ఈ రైల్వే ట్రాక్‌కు ఇప్పుడు పర్యాటకుల తాకిడి బాగా పెరిగిపోయింది.

3 కిలోమీటర్ల మేర:

3 కిలోమీటర్ల మేర:

2011 ముందు వరకూ దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు.. తర్వాత కొన్ని వెబ్‌సైట్లు దీన్ని వెలుగులోకి తెచ్చేసరికి ప్రేమికులకు, కొత్తగా పెళ్లిచేసుకునే వారికి ఇదో సందర్శనీయ స్థలంగా మారిపోయింది. రైల్వే ట్రాక్ చుట్టూ చెట్లు అల్లుకున్నట్లు దాదాపు 3 కిలోమీటర్ల మేర ఉండటం దీని ప్రత్యేకత. ఉక్రెయిన్‌లోని క్లెవాన్ సమీపంలో ఉన్న ఈ ప్రేమ సొరంగం వద్ద వెడ్డింగ్ ఫొటోలు తీసుకోవడానికి జంటలు తరలివస్తుంటాయి. అయితే.. ఈ మధ్య వరకూ ప్రేమ సొరంగం ఇలా ఏర్పడటం వెనుక ఉన్న విషయం వెలుగులోకి రాలేదు.

రాకపోకలు త గ్గాయి:

రాకపోకలు త గ్గాయి:

ప్రచ్ఛన్న యుద్ధ కాలం సమయం నుంచీ ఇక్కడ ఓ రహస్య సైనిక స్థావరం ఉందట. దీంతో ఎవరి కంట పడకుండా సైనిక సామగ్రిని రవాణా చేసే ఉద్దేశంతో పట్టాల పక్కన చెట్లు పెంచడం మొదలుపెట్టారు. తర్వాతి కాలంలో ఈ మార్గం ద్వారా మిలటరీ సామగ్రి రాకపోకలు త గ్గాయి. అయినప్పటికీ ఇవి నీట్‌గా కట్ చేసినట్లు ఉన్నాయంటే దానికి కారణం.. దగ్గర్లోని ప్లైవుడ్ పరిశ్రమే.

 పట్టాలకు అడ్డంగా:

పట్టాలకు అడ్డంగా:

క్లెవాన్‌కు సమీపంలో ఉన్న ఓగ్రామం వద్ద భారీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ ఉంది. దీంతో ఇక్కడ్నుంచి ప్లైవుడ్ రవాణా రైళ్ల ద్వారా సాగుతుంది. దాంతో వారే.. చెట్ల కొమ్మలు అడ్డం పడకుండా.. ఇలా ట్రిమ్ చేస్తూ ఉంటారు. అయితే.. ఈ మార్గం వెలుగులోకి రావడంతో వారి రైళ్ల రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతోందట. పర్యాటకులు ఫొటోలు తీసుకోవడానికి పట్టాలకు అడ్డంగా నిల్చుండటంతో సమస్యలు ఎదురవుతున్నాయట. ఆ సమస్యలన్నీ మనకెందుకు గానీ ఇపుడు ఈ "ప్రేమ సొరంగం లో, కళ్లుతిప్పుకోలేని ఆ లొకేషన్ లో రోబో 2.0 పాటను షూట్ చేయాలనుకుంటున్నాడు శంకర్. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ను నవంబర్ 20న ముంబయిలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు:

మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు:

రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజువల్ వండర్ 2.0. ఇదే కాంబినేషన్ లో రూపొందిన రోబో సినిమాకు సీక్వల్ గా రూపొందుతున్న ఈ సినిమాను మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. ఐ సినిమా ఫెయిల్యూర్ తో డీలా పడ్డ శంకర్, 2.0తో మరోసారి తన స్టామినా ప్రూవ్ చూసుకోవాలని భావిస్తున్నాడు.రజనీ అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినా.. ప్రస్తుతం శంకర్ ప్లానింగ్ తో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

English summary
Reportedly, the song is a romantic number featuring Chitti - the Robot and his girlfriend, played by superstar Rajinikanth and Amy Jackson. It has been shot at the world famous tourist destination, 'Tunnel of Love' in Ukraine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu