For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లింగా ఆడియో: రజనీ క్షమాపణ, చిరంజీవి గురించి..(ఫోటోస్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘లింగా' చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో వేడుక సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్‍లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రజనీకాంత్, హీరోయిన్లు అనుష్క, సోనాక్షి సిన్హా, జగపతిబాబు, దర్శకుడు కెఎస్ రవికుమార్, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, కెమెరామెన్ రత్నవేలతో పాటు....తెలుగు సినిమా ప్రముఖులు కె.విశ్వనాథ్, అల్లు అరవింద్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు.

  ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ....హుధూద్ తుఫాన్ బాధితులకు సహాయం అందించేందుకు నిర్వహించిన ‘మేము సైతం' కార్యక్రమానికి హాజరు కాలేక పోయినందుకు తెలుగు వారికి క్షమాపణలు చెబుతున్న్లట్లు తెలిపారు. సినిమా గురించి మాట్లాడుతూ...సినిమా సబ్జెక్టు చాలా పెద్దది, బ్యాక్ డ్రాప్ పెద్దగా ఉంటుంది. ఓ డ్యాం చుట్టూ సినిమా సాగుతుంది. ఇందులో నటించిన వారంతా బిజీ ఆర్టిస్టులే. వీరితో కేవలం 6 నెలల్లో షూటింగ్ పూర్తి కావడం చాలా గ్రేట్, దర్శకుడు రవికుమార్, నిర్మాత వెంకటేష్, ఇతర టెక్నీషియన్స్, నటీనటుల సహకారం వల్లనే ఇది పూర్తయిందన్నారు.

  స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

  స్టోరీ, హీరోయిన్ల గురించి రజనీకాంత్

  స్టోరీ, హీరోయిన్ల గురించి రజనీకాంత్

  నాకు స్టోరీ బాగా నచ్చింది. తెలుగు వారికి కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. సినిమాలో యాక్షన్ సీన్లకంటే ఎక్కువగా కష్టపడింది మాత్రం....అనుష్క, సోనాక్షి సిన్హాలతో కలిసి డ్యూయెట్స్ చేయడానికే. కెమెరామెన్ రత్నవేలు, మేకప్ మేన్స్ చాలా కష్టపడి నన్ను అందంగా, యంగ్ గా చూపెట్టారు అన్నారు.

  నిర్మాత గురించి

  నిర్మాత గురించి

  రాక్ లైన్ వెంకటేష్ ఆపద్భాంధవుడు లాంటి వ్యక్తి, ఎక్సలెంట్ నిర్మాత. జగపతి బాబుతో మంచి స్నేహం ఏర్పడింది. అది అలాగే కంటిన్యూ అవుతుంది అన్నారు.

  బాహుబలి, చిరంజీవి గురించి

  బాహుబలి, చిరంజీవి గురించి

  ఇంత పెద్ద సినిమా చిత్రీకరణ 6 నెలల్లో పూర్తి కావడం చాలా గ్రేట్. అలా అని లింగా సినిమాను ‘బాహుబలి' చిత్రంతో కంపేర్ చేయొద్దు. ఆ సినిమా రెండు పార్టులు. రాజమౌళి నెం.1 టెక్నీషియన్. ఆయన లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉండటం తెలుగు వారికి గౌరవం అన్నారు. అవకాశం వస్తే ఆయనతో నటిస్తాను అన్నారు. తన నెక్ట్స్ సినిమా ఎప్పుడు? అని అడిగిన అల్లు అరవింద్ మాటలను ప్రస్తావిస్తూ...ముందు చిరంజీవితో 150వ సినిమా తీయండి. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు అన్నారు.

  జగపతి బాబు మాట్లాడుతూ..

  జగపతి బాబు మాట్లాడుతూ..

  రజనీకాంత్ ఎందుకు అంత గొప్ప మనిషి? అని తాను చాలాసార్లు ఆలోచించానని హీరో జగపతిబాబు తెలిపారు. తాను చాలా కాలం చెన్నైలో ఉన్నానని, అప్పట్నుంచే తాను ఆయనను అభిమానించేవాడినని అన్నారు. ఓ సందర్భంలో ఆయనతో మాట్లాడుతూ, 'సార్, మీరెలా అంత సాధారణంగా ఉండగలుగుతున్నార'ని అడిగానని, అప్పుడాయన 'బాబు, నేను కండక్టర్ ని అనే విషయాన్ని ఇప్పటికీ మరువలేనని, తనకు లభించినదంతా బోనస్ అని' ఆయన పేర్కొన్నారు. అందుకే తాను సాధారణమైన కండక్టర్ లా ఉంటానని ఆయన చెప్పారని, అంత గొప్ప వ్యక్తి అలా అనడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన చెప్పారు. ఆయనను చూసి ఎంతో నేర్చుకోవచ్చని జగపతి బాబు తెలిపారు.

  రవికుమార్ మాట్లాడుతూ...

  రవికుమార్ మాట్లాడుతూ...

  రజనీ సార్ పుట్టిన రోజు కానుకగా లింగా సినిమా నిలిచిపోతుందని ఆ సినిమా దర్శకుడు కేఎస్ రవికుమార్ తెలిపారు. లింగా సినిమా ద్వారా తనకు ఎంతో మంది ఆత్మీయులు దొరికారని అన్నారు. జగపతిబాబులాంటి సోదరుడు, తండ్రి లాంటి విశ్వనాథ్ గారు, సోదరిలు అనుష్క, సోనాక్షి లు తనకు ఎంతో నచ్చారని అన్నారు. సినిమా షూటింగ్ ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో జరిగిపోయిందని ఆయన చెప్పారు. సినిమా యూనిట్ మొత్తానికి ధన్యవాదాలని, రజనీసార్ సినిమా అంటేనే కన్నుల పండుగగా ఉంటుందని ఆయన తెలిపారు.

  అనుష్క మాట్లాడుతూ...

  అనుష్క మాట్లాడుతూ...

  లింగా సినిమాలో యూనిట్ అంతా కుటుంబంలా కష్టపడి మంచి సినిమా తీశారని హీరోయిన్ అనుష్క తెలిపారు. అతి తక్కువ సమయంలో సినిమా షూటింగ్ జరిగిపోయిందని తెలిపింది.

  సోనాక్షి సిన్హా మాట్లాడుతూ...

  సోనాక్షి సిన్హా మాట్లాడుతూ...

  తాను ఎంతో అదృష్టం చేసుకున్నానని సోనాక్షిసిన్హా తెలిపింది. తన తొలి తమిళ, తెలుగు సినిమాలో రజనీకాంత్ గారితో నటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది.

  త్రివిక్రమ్ మాట్లాడుతూ...

  త్రివిక్రమ్ మాట్లాడుతూ...

  పెళ్లికి జీలకర్ర, బెల్లం ఎంతో ముఖ్యం, అక్షింతలు పక్కనే ఉంటాయి. వాటిని అందరూ వేసుకుని వెళ్లిపోతుంటారు. తాను కూడా అక్షింతలు వేయడానికే వచ్చానని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపారు. రజనీకాంత్ సినిమా అనగానే అభిమానులంతా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తారని, తాను కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు.

  కె విశ్వనాథ్ మాట్లాడుతూ...

  కె విశ్వనాథ్ మాట్లాడుతూ...

  రజనీకాంత్ ను చూసి వర్థమాన నటీనటులు ఎంతో నేర్చుకోవాలని కళాతపస్వి విశ్వనాథ్ తెలిపారు. తన జీవితంలో రెండు కోరికలు తీరకుండా మిగిలిపోయాయని అన్నారు. రజనీకాంత్ తో సినిమా చేయాలి అనేది ఒకటైతే, రెండోది బాలచందర్ గారితో ఓ సినిమాలో నటించాలని ఆయన చెప్పారు. తన కోరికల్లో ఒకటి త్వరలో తీరనుందని, రెండోది ఈ ఆడియో ఫంక్షన్ లో పాల్గోవడం ద్వారా తీరిందని ఆయన అన్నారు.

  English summary
  Rajinikanth, Anushka, Sonakshi starrer Lingaa Movie Audio Launch held at Park Hayath Hotel.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X