»   » సచిన్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీస్సులు.. థ్యాంక్యూ తలైవా అంటూ..

సచిన్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీస్సులు.. థ్యాంక్యూ తలైవా అంటూ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రికెట్ గ్రౌండ్‌లో బౌలర్లను గడగడలాడించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వెండితెర మీద కూడా ప్రత్యర్థి క్రికెటర్లకు తడాఖా చూపించబోతున్నారు. అదేనండి.. సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ అనే పేరుతో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సచిన్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీస్సులు అందించగా, అందుకు ప్రతిగా మాస్టర్ బ్లాస్టర్ ధన్యవాదాలు తెలుపడం విశేషం.

మాస్టర్‌కు తలైవా కంగ్రాట్స్

సచిన్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. యూట్యూబ్‌లో ఆ ట్రైలర్‌కు విశేషంగా ఆదరణ లభిస్తున్నది. ఈ సందర్భంగా సచిన్‌ను కంగ్రాట్స్ తెలియజేయాలని రజనీకాంత్ నిర్ణయించుకొన్నారు. అనుకున్నదే తడువుగా సచిన్‌ కోసం ట్విట్టర్‌లో ఓ సందేశాన్ని పెట్టారు. ‘మై డియర్ సచిన్.. సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్ చిత్రం విజయవంతం కావాలని కోరుకొంటున్నాను. మీకు దేవుడి దీవెనలు వెన్నంటి ఉంటాయి అని ట్వీట్ చేశారు.

రజనీకి సచిన్ థ్యాంక్స్

రజనీకాంత్ ట్వీట్ చేయడంపై సచిన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘థ్యాంక్యూ తలైవా. నా జీవిత కథ ఆధారంగా వస్తున్న సినిమా మీకు నచ్చుతుందని అనుకొంటున్నాను అని ట్వీట్ సచిన్ చేశాడు. తన ట్వీట్‌తోపాటు తమిళ ట్రైలర్, ఈ సినిమాకు పోస్టర్‌ను ట్యాగ్ చేశాడు.

ట్రైలర్‌కు మంచి స్పందన

మరాఠీ భాషలో విడుదలైన సచిన్ చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తున్నది. ఈ ట్రైలర్‌ బాగుందని చాలా రివ్యూలు వచ్చాయి. సోషల్ మీడియాలో సెలబ్రీటీలు పొగడ్తల వర్షం కురిపించారు. క్రికెటర్ల జీవిత ఆధారంగా ఇటీవల రూపొందిన చిత్రాల్లో సచిన్ చిత్రం మూడోవది. గతంలో అజర్, ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరి చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి.

మే 26న విడుదల

మే 26న విడుదల

క్రికెటర్ల బయోపిక్‌కు సంబంధించి ఎక్కువ బడ్జెట్‌తో రూపొందిన రెండో చిత్రమింది. సుశాంత్ రాజ్‌పుత్ నటించిన ఎంఎస్ ధోని చిత్రం సచిన్ చిత్రం కంటే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించారు. సచిన్ చిత్రంలో మాస్టర్ బ్లాస్టర్ బాల్యం నుంచి క్రికెటర్‌గా సంచలనాలు సృష్టించినంత వరకు పలు అంశాలను ప్రస్తావించినట్టు ట్రైలర్ ద్వారా స్పష్టమైంది. ఆ చిత్రం 2017 మే 26 తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది.

English summary
The South Indian legend Rajinikanth wishes Master Blaster Sachin Tendulkar success for his biopic. This movie trailor get good response from all the sections. In this occassion South legend Rajinikanth too decided to chime in and congratulate the cricketer on his venture and wish him all the best. "Dear sachin_rt , my best wishes for the success of 'Sachin ... a billion dreams'. God bless." he tweeted. In response to the veteran actor's comment, the cricketing superstar tweeted back "Thank you Thalaiva.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu