For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘2.0’ ఆడియో వేడుక: రజనీ స్పీచ్ కేక, అదరగొట్టిన రానా! (ఫోటోస్)

  By Bojja Kumar
  |

  రజనీకాంత్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన '2.0' మూవీ ఆడియో వేడుక శుక్రవారం సాయంత్రం దుబాయ్ లో కనివినీ ఎరుగని రీతిలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు హీరో రజనీకాంత్ తో పాటు విలన్ పత్రధారి అక్షయ్ కుమార్, హీరోయిన్ అమీ జాక్సన్, దర్శకుడు శంకర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తదితరులు హాజరయ్యారు.

  వేలాది మంది అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఇండియన్ సినిమా చరిత్రలోనే విదేశంలో జరిగిన బిగ్గెస్ట్ ఆడియో లాంచ్ కార్యక్రమంగా నిలిచింది. రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్, కళకారుల ఆటపాటలతో వేడుక అదిరిపోయింది. తెలుగు వ్యాఖ్యాతగా రానా, హిందీ వ్యాఖ్యాతగా కరణ్ జోహార్, తమిళ వ్యాఖ్యాతగా ఆర్జె బాలాజీ ఈ షోను హోస్ట్ చేశారు.

   నట జీవితం త్వరగా ముగిసినట్లు అనిపించింది

  నట జీవితం త్వరగా ముగిసినట్లు అనిపించింది

  ఈ సందర్భంగా రజనీకాంత్‌ మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీలో నా నట జీవితం త్వరగా ముగిసినట్లు అనిపిస్తోంది. నేను ఈ రంగంలోకి వచ్చి నాలుగైదు సంవత్సరాలే అయినట్లు ఉంది. దేవుడి కృప, ప్రక్షకుల ఆశీస్సుల వల్లే ఈ స్థాయి వచ్చాను... అని రజనీకాంత్ అన్నారు.

  Just One Song In Rajinikanth's "2.0" రోబో 2.0 లో పాటల సంగతేంటో
   డబ్బు, పేరు ప్రఖ్యాతలు కొంత వరకే సంతృప్తి

  డబ్బు, పేరు ప్రఖ్యాతలు కొంత వరకే సంతృప్తి

  డబ్బు, పేరుప్రఖ్యాతులన్నీ కొంత వరకే సంతోషాన్ని ఇస్తాయి. ముఖ్యంగా కెరీర్‌ ఆరంభంలో ఆ భావన ఉంటుంది. ఓ దశ దాటిన తర్వాత ఆ మూడూ ఎలాంటి సంతోషాన్ని ఇవ్వవు. అయితే అవి లేకపోతే దురదృష్టంగా భావిస్తాం. తలచుకుంటే నవ్వొస్తోంది... అని రజనీకాంత్ అన్నారు.

   సోషల్ మీడియాలో దుష్ప్రచారం వద్దు

  సోషల్ మీడియాలో దుష్ప్రచారం వద్దు

  మంచి సినిమాలను, మంచి నటులను ఎంకరేజ్ చేద్దాం. సినిమా ఎలా ఉన్నా... సోషల్‌మీడియాలో మాత్రం దానిపై దుష్ప్రచారం చేయొద్దు'' అని అని ఈ సందర్భంగా రజనీకాంత్ సూచించారు.

   నేటి యువతరం మరిచిపోతోంది

  నేటి యువతరం మరిచిపోతోంది

  ‘నేటి యువతరం నెమ్మదిగా సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోతోంది. ఇది విచారకరం. వారు ఎప్పటికీ అలా చేయకూడదు. మన సంస్కృతి, సంప్రదాయాలను ఆస్వాదించాలి'' అని కరణ్ జోహార్ అడిగిన ఓ ప్రశ్నకు రజనీకాంత్ సమాధానం ఇచ్చారు.

   నా భర్తను చూస్తుంటే గర్వంగా ఉందన్న లతా రజనీకాంత్

  నా భర్తను చూస్తుంటే గర్వంగా ఉందన్న లతా రజనీకాంత్

  ఈ వేడుకకు హాజరైన రజనీ సతీమణి లత మాట్లాడుతూ నా భర్తను చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ సినిమా కోసం ఆయన పడిన శ్రమకు సెల్యూట్‌ చేయాలి. అందరూ కలిసి పనపి చేయడం వల్లనే ఇపుడు సినిమా ఒక అద్భుతంలా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అన్నారు.

   రజనీతో డైలాగ్ చెప్పించిన రానా

  రజనీతో డైలాగ్ చెప్పించిన రానా

  తెలుగులో వ్యాఖ్యాతగా వ్యవహరించిన రానా మాట్లాడుతూ.. ‘నేను ప్రశ్నలు అడిగేంత వాడిని కాదు సర్‌. తెలుగువాళ్ల కోసం ఒక్క డైలాగ్‌ తెలుగులో చెప్పండి సర్ అని కోరగా..., ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే' అంటూ రజనీ డైలాగ్ చెప్పారు.

  రజనీ సర్‌తో నటించే అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ చెప్పిన అక్షయ్

  రజనీ సర్‌తో నటించే అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ చెప్పిన అక్షయ్

  అక్షయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ రజనీకాంత్ నిజమైన సూపర్‌స్టార్‌. ఈ సినిమాలో రజనీ సర్‌తో దర్శకుడు శంకర్‌ సర్‌కి థాంక్స్. ఇంత పెద్ద, గొప్ప చిత్రంలో నటించే అవకాశం వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు... అని అక్షయ్ కుమార్ అన్నారు.

   దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి చాలా అంశాలు నేర్చుకోవచ్చు

  దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి చాలా అంశాలు నేర్చుకోవచ్చు

  ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతునన్ని రోజులూ నేను కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉన్నా. దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి చాలా అంశాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే వారి పనితీరు అలా ఉంటుంది. ఇక్కడి వారు ఇతరుల ప్రతిభను గౌరవిస్తూ, అందరితో కలిసి సమష్టిగా పనిచేస్తారు. నేను నేర్చుకున్న అంశాల్లో ఇదీ ఒకటి'' అని అక్షయ్ అన్నారు.

   శంకర్‌ సరదాగా ఉన్నా, ఇప్పటికీ ఓ పట్టాన దేన్నీ ఒప్పుకోరు: రెహమాన్

  శంకర్‌ సరదాగా ఉన్నా, ఇప్పటికీ ఓ పట్టాన దేన్నీ ఒప్పుకోరు: రెహమాన్

  ‘ జెంటిల్మెన్ చిత్రం నుండి ఇప్పటి వరకు శంకర్ తో పని చేస్తున్నా. శంకర్‌ సరదాగా ఉన్నా, ఇప్పటికీ ఓ పట్టాన దేన్నీ ఒప్పుకోరు. ముఖ్యంగా క్వాలిటీ విషయంలో రాజీపడరు. ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే కొత్త అంశాలను సినిమాలో చూపించాలనుకుంటారు. పనిని ఎంతగానో ప్రేమిస్తారు. ఆయన అంకితభావం ఎప్పటికీ నాకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. అయితే ఆయన మాత్రం ‘నీ నుంచే స్ఫూర్తి పొందుతుంటా' అని వినయంగా చెబుతుంటారు. ఇది పరస్పరం ఉంటుంది.'' అని అని రెహమాన్ అన్నారు.

   రజనీ సర్ డెడికేటెడ్‌గా పని చేస్తారు

  రజనీ సర్ డెడికేటెడ్‌గా పని చేస్తారు

  దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ.. సినిమా సెట్‌లో రజనీకాంత్‌ ఎప్పుడూ అంకితభావంతో పనిచేస్తారు. ఎలాంటి ఇబ్బంది అయినా భరిస్తారు. ఆయన నటన అనుభవంతో ఎప్పుడూ సరికొత్త ప్రయోగాలకు సిద్ధం అంటారు. సినిమా కోసం ఆయన పడే శ్రమ ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశంలో కనిపిస్తుంది'' అన్నారు.

   రెహమాన్‌ నన్ను ఆశ్చర్యపరిచేవారు

  రెహమాన్‌ నన్ను ఆశ్చర్యపరిచేవారు

  ‘‘రోబో' చిత్రంలోని ‘ఇనుములో ఓ హృదయం మొలిచెలే' అంటూ సాగే పాట ఓ సవాల్‌లాంటిది. ఓ యువతికీ, మెషీన్‌కీ మధ్య ప్రేమను అందులో చూపాలి. అందకు తగిన శబ్దాలు రెహమాన్ క్రియేట్ చేసి నన్ను ఆశ్చర్య పరిచాడు. ఇపుడు 2.0లో రెండు రోబోల మధ్య పుట్టే ప్రేమకు ఓ కొత్త ట్రాక్‌ను సృష్టించాం. ప్రతీసారి అద్భుతమైన సంగీతం కోసం ప్రయత్నించడం మా ఇద్దరికీ కష్టమయ్యేది. అయితే రెహమాన్‌ నన్ను ఆశ్చర్యపరిచేవారు. నన్ను కలిసిన ప్రతీసారి ఏదో ఒక కొత్తదాన్ని వినిపిస్తూ ఉండేవారు.'' అని శంకర్ తెలిపారు.

  English summary
  Megastar Rajinikanth, who attended the grand audio launch of his upcoming 3D sci-fi entertainer ‘2.0’ with the cast and crew here, said he feels sad that the younger generation of India is forgetting our culture and tradition. Hosted by filmmaker Karan Johar, actor Rana Daggubati and RJ Balaji, the audio launch of the S. Shankar directorial took place at the Burj Park here on friday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X