»   » మహేష్ బాబు తండ్రి పాత్రకు రజనీకాంత్ అయితే...!

మహేష్ బాబు తండ్రి పాత్రకు రజనీకాంత్ అయితే...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రజనీకాంత్-మహేష్ బాబు కాంబినేషన్ ఊహించుకోవడానికే ఓ రేంజిలో ఉంటుంది కదూ. అందులోనూ మహేష్ బాబు తండ్రిగా రజనీకాంత్ నటిస్తే..? బక్సాఫీసు బద్దలవ్వాల్సిందే. అయితే రజనీ లాంటి మాస్ హీరో ఫ్యామిలీ ఎంటర్టెనర్లో ఏమంత బాగా సెట్ అవ్వడు. మహేష్ బాబు బ్రహ్మోత్సవంలో ఈ కాంబినేషన్ సెట్ చేయడానికి నిర్మాత పివిపి, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆలోచన చేసారట.

అక్కడ 'బ్రహ్మోత్సవం' షో పడింది, ఇదిగో రివ్యూ రిపోర్ట్!

ఇటీవల ఇంటర్వ్యూలో ఆ చిత్ర నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి మాట్లాడుతూ...'బ్రహ్మోత్సవం' లాంటి భారీ తారాగణం ఉన్న సినిమాకు నటీనటుల ఎంపిక ఓ ఛాలెంజ్ గా మారింది. ఓ ఫోటో ఆల్బం తయారు చేసి ఏజ్ పరంగా ఏ పాత్రకు ఎవరు సెట్టవుతారనే దానిపై చాలా కసరత్తు చేసాం. మహేష్ బాబు తండ్రి పాత్రకు రజనీకాంత్ లేదా మోహన్ లాల్ అనుకున్నాం. కానీ సత్యరాజ్ కూడా ఈ పాత్రకు బాగా సెట్టవుతారని ఆయన్నే ఫైనలైజ్ చేసాం' అన్నారు.

 Rajinikanth considered for role of Mahesh's Father

ప్రస్తుతం మూవీ టీం అంతా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. మే 20 'బ్రహ్మోత్సవం' చిత్రం విడుదలవుతోంది. సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు సంబంధించిన 'మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్', పివిపి సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వినోదాత్మకంగా నడిచే కుటుంబ కథాచిత్రమిది. ఉమ్మడి కుటుంబంలోని సంతోషాలకు ప్రతిరూపంగా ఈ చిత్రం ఉంటుంది. సత్యరాజ్, జయసుధ, నరేష్, రేవతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

పివిపి సంస్థ ఈ చిత్రాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్ లో మహేష్ బాబు సినిమాలకు ఉన్న డిమాండుకు తగిన విధంగా అత్యధిక స్క్రీన్లు కేటాయించారు. నైజాం ఏరియాలో 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అభిషేక్ పిక్చర్స్ సంస్థ అన్ని థియేటర్లలో ఉదయం 8.10కు అభిమానుల కోసం స్పెషల్ షో వేయాలని నిర్ణయించింది. తొలి రోజు(మే 20)న మాత్రమే ఈ స్పెషల్ షో వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతితో తెలంగాణ వ్యాప్తంగా ఈ షో వేస్తున్నారు. స్పెషల్ షోకు పర్మిషన్ ఇచ్చినందుకు గాను తెలంగాణ ప్రభుత్వానికి నిర్మాతలు థాంక్స్ చెప్పారు.

English summary
PVP admits Casting was the biggest challenge his Team faces in the case of 'Brahmotsavam'. 'Initially, We prepared a photo album to figure out which actors should approached based on the character sketch & age factor. For the role of Mahesh's Father, Rajinikanth and Mohan Lal were considered. But, I felt Satyaraj would be apt and finalized him,' he shares.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu