రాణా కోసం రజనీకాంత్‌కు మొదటి వాయిదాలో రూ. 24 కోట్ల చెల్లింపు
అభిమానులకు రజనీకాంత్ స్టార్ కన్నా ఎక్కువ. చెప్పాలంటే అభిమానులకు ఆయన దేవుడు. రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని వారు పూజలు చేస్తున్నారు. సింగపూర్‌లో రజనీకాంత్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ రాణా సినిమాలో నటించడానికి మొదటి విడతగా ఆయనకు 24 కోట్ల రూపాయలు చెల్లించారు.
రజీనీకాంత్ దేశంలో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటుడని, ఆయన 24 కోట్ల రూపాయలు పొందడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు వాటా కూడా తీసుకున్నారని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులో రజనీ రెండో కూతురు సౌందర్య భాగస్వామి కూడా. రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్న నటుడు ధనుష్ ఆ కుటుంబానికి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. రజనీకాంత్ ఆరోగ్యం గురించి ఆయనే ప్రకటనలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











