twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Dada Saheb Phalke Award: రజినీకాంత్ ఖాతాలో ప్రతిష్టాత్మక అవార్డు.. 25 ఏళ్ల తర్వాత రికార్డు

    |

    పేరుకు తమిళ హీరోనే అయినా.. దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో నటించిన ఆయన.. తనదైన శైలి యాక్టింగ్‌తో యూనివర్శల్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. అదే సమయంలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. ఏజ్ బార్ అవుతోన్న కుర్రాళ్లకు ధీటుగా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. అలాగే, జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు ఓ అరుదైన అవార్డు దక్కింది. ఆ వివరాలు మీకోసం!

    బస్ కండక్టర్.. బాలచందర్ చలవతో ఎంట్రీ

    బస్ కండక్టర్.. బాలచందర్ చలవతో ఎంట్రీ

    రజినీకాంత్ అలియాస్ శివాజీ రావ్ గైక్వాడ్.. బెంగళూరులో స్థిరపడిన ఒక మరాఠా కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే నటనపై ఉన్న పిచ్చితో నాటకాల్లో వేషాలు వేశాడు. అప్పుడే బస్ కండక్టర్‌గా ఉద్యోగం సంపాదించాడు. ఈ క్రమంలోనే మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ చేరాడు. అప్పుడే లెజెండరీ డైరెక్టర్ బాలచందర్.. 'అపూర్వ రాగంగళ్' అనే మూవీలో ఛాన్స్ ఇచ్చారు.

    తమిళ హీరో నుంచి.. యూనివర్శల్ స్టార్

    తమిళ హీరో నుంచి.. యూనివర్శల్ స్టార్

    తమిళంలో మాత్రమే కాదు.. దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలతో పాటు హిందీలోనూ నటించారు రజనీకాంత్. తెలుగులో 'టైగర్' అనే సినిమాలో ఎన్టీఆర్‌కు సోదరుడిగా చేసిన ఆయన.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో మెరిశారు. ఆ తర్వాత తన సినిమాలను మన భాషలోకి డబ్బింగ్ చేసి ఇక్కడా మంచి మార్కెట్ అందుకున్నారు. ఫలితంగా దేశం గర్వించే స్థాయికి ఎదిగారు.

    ఈ వయసులోనూ అదే స్పీడుతో సినిమా

    ఈ వయసులోనూ అదే స్పీడుతో సినిమా

    దక్షిణాదిలో ఉన్న హీరోలందరితో పోలిస్తే సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంతో సీనియర్ అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయన ఎంతో వేగంగా సినిమాలను పూర్తి చేస్తుంటారు. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ఎన్నో చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందుకోసం తీరిక లేకుండా షెడ్యూళ్లను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికీ ఆయన అదే వేగాన్ని చూపిస్తూ సత్తా చాటుతున్నారు.

    హైదరాబాద్‌లో అస్వస్థత.. పాలిటిక్స్ అలా

    హైదరాబాద్‌లో అస్వస్థత.. పాలిటిక్స్ అలా

    కొద్ది రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు సూపర్ స్టార్ రజినీకాంత్. అక్కడ ఆయన హైబీపీతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనికి నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్సను తీసుకుని కోలుకున్నారు. అంతకు ముందు రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. ఈ ఘటన తర్వాత పొలిటికల్ ఎంట్రీ చేయడం లేదంటూ వెల్లడించి షాకిచ్చారు.

    రజినీకాంత్ ఖాతాలో ప్రతిష్టాత్మక అవార్డు

    రజినీకాంత్ ఖాతాలో ప్రతిష్టాత్మక అవార్డు


    దాదాపు నలభై ఏళ్లుగా సినీ రంగంలో విశిష్ట సేవలు అందిస్తోన్న రజినీకాంత్‌కు తాజాగా కేంద్ర ప్రభుత్వం 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డును ప్రకటించింది. దేశంలోనే మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్‌ను తెరకెక్కించారు దాదా సాహెబ్ ఫాల్కే. ఈయనను 'ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా'గా పిలుచుకుంటారు. ఈయన పేరు మీద ప్రతి ఏడాది అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

    25 ఏళ్ల తర్వాత రెండో హీరోగా రికార్డు

    25 ఏళ్ల తర్వాత రెండో హీరోగా రికార్డు

    'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డులను ఎప్పటి నుంచో ఇస్తున్నారు. ఇక, తమిళంలో చివరిగా 1996లో శివాజీ గణేషన్ ఈ అవార్డును అందుకున్నారు. 25 ఏళ్ల తర్వాత రజినీకాంత్‌కు ఇప్పుడు ప్రకటించారు. తెలుగులోనూ అక్కినేని నాగేశ్వర్రావుకు గతంలో ఈ అవార్డు దక్కింది. ఇక, 2018 సంవత్సరానికి గానూ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు.

    English summary
    The prestigious Dadasaheb Phalke Awards for South are announced yesterday. Our very own Naveen Polishetty won the awards in Best Actor Telugu Category for his Agent Sai Srinivasa Athreya. Rashmika Mandanna won the Best Actress for Dear Comrade, Sujeeth as Best Director for Saaho.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X