»   »  ‘కాబిల్‌’ ని మెచ్చుకున్న కబాలి

‘కాబిల్‌’ ని మెచ్చుకున్న కబాలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ వంటి స్టార్స్ సైతం తాము రజనీకి పెద్ద ఫ్యాన్స్ మి అని చెప్తూంటారు. అలాంటి రజనీనే ఫలానా హీరో సినిమా కోసం ఎదురుచూస్తున్నాను , ఆ సినిమా ట్రైలర్ బాగుంది అని చెప్తే , ఇంక తిరుగేముంది. అలాంటి లక్కీ అవకాసాన్ని బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కొత్త చిత్రం సాధించింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌కి ప్రత్యేక సందేశం పంపారు. హృతిక్‌, యామీ గౌతమ్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'కాబిల్‌'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌ పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందింది. అయితే దీన్ని చూసిన రజనీ చిత్ర యూనిట్ ని అభినందించినట్లు సమాచారం. 

English summary
After watching the Kaabil trailer recently, Rajinikanth told producer Rakesh Roshan, “I have watched the Tamil, Hindi and Telugu trailers of Kaabil and I simply loved it. I also think Hrithik is stupendous. Please tell him that I am eagerly awaiting the film.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu