రజినీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల: ఇంకా అదే సమస్యతో ఇబ్బంది

సూపర్ స్టార్ రజినీకాంత్ శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయనను సహాయక సిబ్బంది హైదరాబాద్‌లోని అపోలో ఆస్పతిత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన హై బీపీతో బాధ పడుతున్నట్లు నిర్ధారించారు. అప్పటి నుంచి దానికి సంబంధించిన చికిత్సను అందిస్తున్నారు. సూపర్ స్టార్ ఆస్పత్రిలో జాయిన్ అయి దాదాపు 20 గంటలు గడుస్తోన్న నేపథ్యంలో.. తాజాగా అపోలో ఆస్పత్రికి చెందిన వైద్యులు రజినీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

తమ ఆస్పత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి రజినీకాంత్ హైబీపీతో బాధ పడుతున్నారని హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు. ఇప్పటికీ ఆయన బీపీ కంట్రోల్ అవలేదని, అయితే ఆరోగ్యం మాత్రం నిలకడగానే ఉందని వాళ్లు పేర్కొన్నారు. అలాగే, బీపీని కంట్రోల్ చేసేందుకు సరైన చికిత్సను అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆయనకు కొన్ని రకాల వైద్య పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. రిపోర్టులు వచ్చిన తర్వాత అన్నీ బాగుంటే రజినీకాంత్‌ను శనివారం సాయంత్రానికి డిశ్చార్జి చేస్తామని వైద్యులు వివరించారు. అంతేకాదు, ఆయనను చూసేందుకు ఆస్పత్రికి ఎవరూ రావొద్దని కోరారు.

Rajinikanth health update: Blood Pressure still on higher

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న 'అన్నత్తే'లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం కొద్ది రోజుల క్రితం ఆయన హైదరాబాద్‌ వచ్చారు. ఇక్కడ జరుగుతోన్న షెడ్యూల్‌లో పాల్గొంటోన్న సమయంలో రెండు రోజుల క్రితం చిత్ర యూనిట్‌లోని కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. అదే సమయంలో రజినీకాంత్ ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో స్వీయ నిర్భందంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X