అంతర్జాతీయ చిత్రోత్సవాలకు రజనీ కాంత్

కార్యక్రమ నిర్వాహకులైన గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఉపాధ్యక్షులు విష్ణు మాట్లాడుతూ.. రజనీకాంత్ రాకకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది ముఖ్య అతిథిగా బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ వచ్చారని పేర్కొన్నారు.
ఇక 'సూపర్‌స్టార్' రజనీకాంత్ తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో నటిస్తున్న 'విక్రమసింహ'(కోచ్చడయాన్) సినిమాలోని ఒక పాట సోమవారం ఇంటర్నెట్ ద్వారా విడుదల చేశారు. హాలీవుడ్ అనుసరిస్తున్న మోషన్ క్యాప్చర్ సాంకేతికతతో 'విక్రమసింహ'ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన చిత్ర టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఇదిలాఉండగా సినిమాలో 'చూద్దాం ఆకశం అంతం.. వేద్దాం అక్కడే పాదం..' అంటూ సాగే పాటను సోమవారం విడుదల చేశారు. మిగిలిన పాటల్ని ఈ నెల 10న విడుదల చేస్తున్నారు.
ఈ పాటతోసాగే ప్రచార చిత్రం రజనీకాంత్ అభిమానులను ఆకట్టుకుంటోంది. తమిళంలో 'ఎంగే పోగుదు వానం..' అనే ఈ పాటను సీనియర్ గేయ రచయిత వైరముత్తు(తమిళంలో) రాశారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. మిగిలిన పాటలను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ స్వరాలందించారు. దీపికా పదుకొణె కథానాయిక. సునీల్ లుల్ల నిర్మాత.


Click it and Unblock the Notifications











