twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లండన్ లో రజనీకాంత్ కు అవమానం

    By Bojja Kumar
    |

    తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తమిళ సినీ పరిశ్రమ నుంచి నేషనల్ స్టార్ గా ఎదిగిన ఆయన దేశ వ్యాప్తంగానే కాదు, తన సినిమాల ద్వారా జపాన్, చైనా లాంటి దేశాల్లోనూ అభిమానులను ఏర్పరచుకున్నారు. ఇక తమిళ అభిమానులు రజనీని దైవంగా పూజిస్తుంటారు.

    తాజాగా...రజనీ అభిమానులు ఓ విషయంలో తమ హీరోకు అవమానం జరిగినట్లు ఫీలవుతున్నారు. కారణం లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రజనీ మైనపు బొమ్మ లేక పోవడమే. కొందరు అభిమానులు తమ హీరో విగ్రహాన్ని మ్యూజియంలో పెట్టాలని నిర్వాహకులను కోరిన పెద్దగా పట్టించుకోలేదట.

    ఇప్పటికే భారత్ నుంచి అమితాబ్, షారుఖ్ ఖాన్, ఐశ్వర్యరాయ్ లాంటి సినీ ప్రముఖుల మైనపు బొమ్మలు మ్యూజియంలో కొలువుతీరాయి. అయితే దక్షిణాది నుంచి ఉన్న ఏకైక బిగ్ స్టార్ రజనీ ఒక్కడే ఆయన బొమ్మను కూడా పెడితే తమ హీరోకు గౌరవంగా ఉంటుందనేది అభిమానుల వాదన. మ్యూజియానికి వచ్చే సందర్శకుల్లో రజనీ అభిమానులు చాలా మందే ఉంటారు. వారి మూలంగా సదరు మ్యూజియం వారు మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ అంశాన్ని మ్యూజియం వారికి గుర్తు చేస్తూ రజనీ మైనపు విగ్రహాన్ని మ్యూజియంలో పెట్టించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నా లండన్ లోని రజనీ అభిమానులు.

    English summary
    Fans feel that Rajinikanth has been insulted in London. They are referring to the famous Madame Tussauds museum which is housing the wax statues of many international celebrities. While Bollywood stars like Amitabh Bachchan, Aishwarya, Shahrukh Khan etc are there, not one actor from south is present.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X