»   » నా తప్పులన్నీ రజినీకాంత్ భుజాన వేసుకున్నాడు : హృతిక్ మనసులో మాట

నా తప్పులన్నీ రజినీకాంత్ భుజాన వేసుకున్నాడు : హృతిక్ మనసులో మాట

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ రజినీకాంత్ కి దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ హీరో తాజాగా హృతిక్ నటించిన బలం (కాబిల్) చిత్ర ట్రైలర్ ని, పాటలని చూసి ప్రశంసలు కురిపించాడు. ఈ వార్త వినగానే హృతిక్ ఎంతో ఆనందించి రజినీకాంత్ కు కృతజ్ఞతలు తెలిపాడు.

రజనీకాంత్‌ 1986లో నటించిన 'భగవాన్‌ దాదా' అనే హిందీ చిత్రంలో హృతిక్‌ బాలనటుడిగా కన్పించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హృతిక్‌ రజనీని కలిసింది మాట్లాడిందీ లేదు. అయితే హృతిక్‌ నటించిన 'కాబిల్‌' చిత్ర ట్రైలర్‌ చూసి రజనీ బాగుందంటూ హృతిక్‌కి ఓ లేఖ రాశారట.

Rajinikanth is like my father: Hrithik Roshan

రజనీకాంత్‌ లాంటి స్టార్‌ నుంచి అభినందనలు అందుకోవడం అంటే చాలాప్రత్యేకమని ఆయన మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని హృతిక్‌ తెలిపారు. అదీకాకుండా రజనీకాంత్‌ పుట్టినరోజుకి ముందు రోజు రాత్రి హృతిక్‌ తండ్రి రాకేశ్‌ రోషన్‌ రజనీకి విషెస్‌ చెప్పడానికి ఫోన్‌ చేశారు.

రజినీకాంత్, హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ల ది 30 సంవత్సరాల గా కొనసాగుతోన్న స్నేహ బంధం. హృతిక్ రోషన్ తాత గారు జె ఓం ప్రకాష్ తీసిన భగవాన్ దాదా చిత్రం తో వీరిద్దరి బంధం ఏర్పడింది. ఆశక్తి కర విషయం ఏమిటంటే, హృతిక్ రోషన్ కి మొట్ట మొదటి డైలాగ్ ఉన్న చిత్రం ఇదే కావటం.

అప్పుడు హృతిక్ వయసు 12 సంవత్సరాలు కావడం విశేషం. ఆ విషయాలను గుర్తు చేసుకున్న హృతిక్ "అప్పుడు సరిగ్గా నటించక రీటేక్‌లు తీసుకునేవాణ్ణి. అయితే ఆయన ఆ తప్పును తనపై వేసుకుని, తన కోసం రీటేక్‌ చేద్దామని చెప్పేవారు. నాలో ఉత్సాహం తగ్గకుండా, స్ఫూర్తినింపేందుకు నా తప్పును ఆయనపై వేసుకున్నారు.

అంతటి గొప్ప వ్యక్తి రజనీ సార్‌. నాకు తండ్రితో సమానం. మార్గదర్శకులు, స్నేహితుడు కూడా. పిల్లలు, పెద్దలు అందర్నీ సమానంగా గౌరవించే వ్యక్తి. ఆ వయసులో ఆయన ఎంతో పెద్ద స్టారో నాకు తెలియదు. తెలిశాక ఆయన్ని ఆరాధించకుండా ఉండలేము' అని అప్ప్టి సంఘటనలని గుర్తు చేసుకున్నాడు అలాగే ధనుష్‌ గురంచి ప్రస్తావిస్తూ.. ఒక నటుడిగా ధనుష్‌ ఎంతో స్ఫూర్తినిస్తాడని, అతని నటన తనకు నచ్చుతుందన్నారు.

English summary
At the age of 12, Hrithik made his acting debut with 1986 film Bhagawan Dada alongside Rajinikanth. The film was directed by Hrithik’s maternal grandfather J Om Prakash.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu