»   » నాపై ఎలాంటి కేసులు లేవని సర్టిఫికెట్ ఇవ్వండి: రజనీకాంత్

నాపై ఎలాంటి కేసులు లేవని సర్టిఫికెట్ ఇవ్వండి: రజనీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో రజనీకాంత్ చుట్టూ ఏవో కొన్ని వివాదాలు మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన చెన్నై నగర పోలీస్ కమీషనర్ పెట్టుకున్న ఓ దరఖాస్తు చర్చనీయాంశం అయింది. తనపై ఎలాంటి నేరారోపణలు, కేసులు లేవని సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు.

రజనీకాంత్ ఈ దరఖాస్తు పెట్టుకోవడానికి కారణం....ఆయన ‘2.o'(రోబో-2) షూటింగులో భాగంగా విదేశాలకు వెళ్లాల్సి రావడమే. అయినా రజనీకాంత్ సినిమా షూటింగుల్లో భాగంగా విదేశాలకు వెళ్లడం సాధారణంగా జరిగేదే...ఇప్పుడు మాత్రం ఇదేంటి కొత్తగా? అనే డౌట్ మీకు రావొచ్చు. అందుకు కారణం ఈచిత్రం షూటింగ్ బోలీవియాలో కూడా ఉండటమే. బొలీవియా వెళ్లాలంటే ఇలాంటి పోలీస్ ధృవీకరణ పత్రం ఒకటి చూపించాలట.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తొలుత ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ తో విలన్ రోల్ చేయించాలనుకున్నారు. చివరకు ఆ స్థానంలో అక్షయ్ కుమార్‌ను ఫిక్స్ చేసారు. దర్శకుడు శంకర్ ఈ విషయమై అక్షయ్ కుమార్‌ను సంప్రదించగానే వెంటనే ఒకే చెప్పేసారట. అప్పటికే తాను విపుల్ షా దర్శకత్వంలో ‘నమస్తే ఇంగ్లండ్' సినిమా కమిట్ అయి 4 నెలల డేట్స్ కూడా కేటాయించినప్పటికీ ‘2.0' సినిమా కోసం.... ‘నమస్తే ఇంగ్లండ్' చిత్రం షూటింగును వాయిదా వేసుకున్నాడట అక్షయ్ కుమార్.

Rajinikanth needs a certificate from Police Department

ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కే ఈ చిత్రంగా ‘రోబో 2.0' ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో అసలు ఈ చిత్రానికి ఎంత బడ్జెట్ పెడుతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతోందని నిర్మాత లైకా ప్రొడక్షన్స్ వారు ప్రకటించారు. ఇది ఇండియన్ సినిమాలోనే హై బడ్జెట్ ఇది. 2017 సమ్మర్ లో ఈ చిత్రం విడుదల కానుంది.

3డి ఫార్మాట్‌లో తీయనున్న ఈసినిమాని ఇంటర్నేషనల్‌గా రిలీజ్‌ చేయటానికి ప్లాన్‌చేశారు. సౌత్‌ నుంచి ఇంటర్నేషనల్‌ వరకూ ఓ సినిమాని ఒకే టైటిల్‌తో ప్రమోట్‌ చేయటానికి శంకర్‌ ఈ సినిమా టైటిల్‌ని 2.0గా మార్చినట్లు చెబుతున్నారు.

English summary
Superstar Rajinikanth needs a certificate from Police Department to visit a foreign country. As per reliable sources director Shankar has planned to shoot some portions of the mega budget sci-fi thriller '2.0' in Bolivia and the team will be flying to the South American country soon.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu