'కోచ్చడయాన్'కు ముందే రజనీ మరో చిత్రం...డిటేల్స్
ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అది కార్యరూపం దాల్చలేదు. సినిమాను మరింత జనరంజకంగా చూపేందుకు అత్యున్నత సాంకేతికతను ఉపయోగించి మరిన్ని గ్రాఫిక్స్ హంగులు జోడించాలని రజనీ సూచించారు. ఇందులో భాగంగానే 'కోచ్చడయాన్' విడుదల మరింత జాప్యం కావచ్చని సమాచారం.
అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ 'కోచ్చడయాన్'కు ముందే మరో సినిమాతో వారి చెంతకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడట సూపర్‌స్టార్. దీన్ని తెరకెక్కించే బాధ్యతను తన ఆస్థాన దర్శకుడు కేఎస్ రవికుమార్‌కు అప్పగించాడట. ఇందుకు సంబంధించి ఇటీవల ఇద్దరి మధ్య చర్చలు కూడా జరగాయి.
గతంలో వచ్చి సూపర్ హిట్స్ అయిన 'ముత్తు', 'పడయప్పా' (నరసింహ) లాంటి కామెడీ, యాక్షన్ మిళితమైన కథను సిద్ధం చేయాలని, షూటింగ్ ను రెండు నెలల్లో ముగించటంతోపాటు, స్టోరీని బయటకు పొక్కనివ్వద్దని కేఎస్ రవికుమార్‌ను కోరాడట రజనీకాంత్. ప్రస్తుతం రవికుమార్ అదే పనిలో ఉన్నట్లు త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవనున్నాయని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications












