twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హంతకుడిని పట్టించిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఏం జరిగిందంటే

    |

    సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా సినిమాల్లో హంతకులు, నేరస్తుల భరతం పట్టడం చూశాం. అయితే రియల్ లైఫ్‌లో కూడా అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకోవడం చర్చనీయాంశం అయింది. అయితే ఇక్కడ రజనీకాంత్ స్వయంగా రంగంలోకి దిగక పోయినా... అతడి పోస్టర్ ఒక నేరస్తుడిని పట్టించింది.

    నెల్లూరు జిల్లా రామలింగాపురంలో మే 28న ఒక మహిళ హత్య జరిగింది. మహిళను ఇంట్లోనే హత్య చేసి నగలతో పారారైన ఆటో డ్రైవర్‌ను పట్టుకోవడంలో రజనీకాంత్ మూవీ పోస్టర్ హెల్ప్ చేసింది. సీసీ టీవీ కెమెరాలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

    హత్యకు పాల్పడిన రామస్వామి తన ఆటోపై రజనీకాంత్ పోస్టర్ అతికించుకున్నాడు. హత్య అనంతరం అదే ఆటోలో పరారయ్యారు. అయితే సీసీ టీవీలో ఆటో నెంబర్ సరిగా కనిపింక పోవడంతో....ఆటోపై ఉన్న పోస్టర్ ఆధారంగా హంతకుడిని పట్టుకున్నారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    మృతురాలు నిర్మలా భాయి

    మృతురాలు నిర్మలా భాయి

    మృతురాలిని బొందెలి నిర్మలా భాయి(45)గా గుర్తించారు. స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో క్లర్క్‌గా పని చేస్తోంది. ఆమె భర్త రమేష్ సింగ్ మూడేళ్ల క్రితం మరణించాడు. కుమారుడు బెంగుళూరులో పని చేస్తుండగా, కూతురు తిరుపతిలో చదువుకుంటుండగా ఆమె అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది.

    జల్లెడ పట్టిన పోలీసులు

    జల్లెడ పట్టిన పోలీసులు

    హత్య అనంతరం పోలీసులు నెల్లూరు సిటీ, పరిసర ప్రాంతాల్లోని దాదాపు పదివేల ఆటోలను పరిశీలించారు. రజనీకాంత్ పోస్టర్ ఆధారంగా హంతకుడిని ట్రేస్ చేశారు. హంతకుడు ఆమె మెడలో ఉన్న గోల్డ్ చైన్, బంగారు గాజులు, రూ. 2 వేల నగదు దోచుకెళ్లినట్లు గుర్తించారు.

    నిప్పంటించి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం

    నిప్పంటించి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం

    అయితే ఈ హత్యను యాక్సిడెంటల్ డెత్‌గా మలిచేందకు రామస్వామి ఇంట్లోని పాత న్యూస్ పేపర్లను జమచేసి నిప్పంటించడంతో పాటు గ్యాస్ లీక్ చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఇంటి నుంచి పొగలు రావడం గమనించిన చుట్టు పక్కల వారు అక్కడకి వెళ్లి చూడగా నిర్మలా భాయి మరణించి కనిపించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    రజనీకాంత్

    రజనీకాంత్

    రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే... ‘పెట్టా' సినిమాతో ఈ ఏడాది ప్రారంభంలోనే తొలి విజయం నమోదు చేసిన రజనీకాంత్ ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్' అనే చిత్రం చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్, నివేతా థామస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    English summary
    Rajinikanth poster helps AP police to crack murder case in Nellore. Police told mediapersons that Bondili Nirmala Bhai, living in Ramalingapuram in Nellore had been murdered on May 28 by Auto driver.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X