»   »  మహేష్ అద్బుతం....! స్పైడర్ పై రజినీకాంత్ వ్యాఖ్య

మహేష్ అద్బుతం....! స్పైడర్ పై రజినీకాంత్ వ్యాఖ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ మూవీపై ప్రముఖులందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజినీకాంత్ ఈ చిత్రం అద్భుతం అంటూ చిత్రం టీంకి తన అభినందనలను తెలిపారు.సామాజిక సందేశంతో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన స్పైడర్ మూవీకి తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రశంసలందించారు.

మురుగదాస్ అండ్ టీం రజనీకాంత్ కోసం స్పెషల్ షో వేశారు. సినిమా చూసిన తర్వాత రజనీ చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు. "సినిమా చాలా బాగుంది. అద్భుతమైన యాక్షన్ పార్ట్‌తో పాటు మంచి మెసేజ్ కూడా చిత్రంలో మిళితం చేసిన తీరు సూపర్బ్. డైరెక్టర్ మురుగదాస్ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు.

Rajinikanth praises Mahesh Babu's 'Spyder'

మహేష్ అద్భుతమైన అభినయాన్ని కనబరిచాచాడు. ఇంత గొప్ప చిత్ర చిత్రీకరణలో భాగమైన యూనిట్ అందరికి అభినందనలు.." అంటూ 'స్పైడర్' పై సూపర్‌‌స్టార్ రజినీకాంత్ ప్రశంసలు కురిపించాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంత నెగిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో సినిమా సూపర్ అంటూ రజినీకాంత్ పొగడ్తలు కురిపించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Reportedly, the Tamil-Telugu movie has been doing well, especially in Tamil Nadu. Directed by Murugadoss, the movie even bagged laurels from Tamil superstar, Rajinikanth
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu